టీడీపీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎవ‌రి చేతిలోకి..?

April 17, 2019 at 3:15 pm

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత తెలుగుదేశం పార్టీలో సంక్షోభం త‌లెత్త‌నుందా..? చ‌ంద్ర‌బాబు కూడా ఆ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని కొడుకు గాని కోడ‌లు చేతిలో గాని పెడ‌తార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇద్ద‌రిలో ఎవ‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించినా పార్టీని గంగ‌లో క‌లిపిన‌ట్లేననే అభిప్రాయం తెలుగు త‌మ్ముళ్ల‌ను వేధిస్తోందంట‌. అయితే నంద‌మూరి ఫ్యామిలీ చేతిలోకి రాజ‌కీయం వెళ్ల‌కుండా చూసుకునేందుకే చంద్ర‌బాబు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. అందుకే ఇప్ప‌టికే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం చేయ‌డంలో ఆయ‌న ప‌న్నిన కుట్ర‌లు ఫ‌లించాయ‌నే వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది.

ఇక జూనియ‌ర్‌ను తెర‌మీద‌కు తీసుకువ‌స్తే అసలే ప‌ప్పు బాబుగా ముద్ర‌ప‌డిన లోకేష్ ప‌రిస్థితి మ‌రింత అధ్వానంగా మారుతుంద‌ని, అదే స‌మ‌యంలో కోడ‌లు తెర‌మీద‌కు తీసుకువ‌ద్దామంటే ఆమెకు ఏమాత్రం రాజ‌కీయ అనుభ‌వం, రంగంలో ఆరి తేరిన అనుభ‌వ‌మూ లేద‌ని చంద్ర‌బాబు వేద‌న ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. తెలుగుత‌మ్ముళ్లు మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ అయితే పార్టీకి హెల్ప్ అవుతుందని ఆఫ్ ది రికార్డులో పేర్కొంటున్నార‌ట‌. ఆయ‌న మాత్రం ఇప్ప‌ట్లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం త‌న‌కు ఇష్టం లేద‌ని సున్నితంగానే తిర‌స్క‌రించార‌ట‌.

అయితే చంద్ర‌బాబు చేతిలో పార్టీ ఉన్నంత కాలం ఆయ‌న అరంగేట్రం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ర‌ని సమాచారం. పార్టీ మొత్తాన్ని త‌న వైపు తిప్పుకోగ‌ల శ‌క్తిసామ‌ర్థ్యాలు తార‌క్ ఉన్నాయ‌ని చంద్ర‌బాబు న‌మ్ముతున్నార‌ట‌. అందుకే ఆయ‌న్ను పార్టీకి అంటుకోకుండా చేస్తున్నారు. అనేక కుట్ర‌లు, కుతంత్రాల మేళావింపు రాజ‌కీయ రంగ‌రింపు వంట‌కంలా ఉండే చంద్ర‌బాబు కుయుక్తుల‌తో పార్టీ భ్ర‌ష్టు ప‌డుతోంద‌న్న వాద‌న వినిపించే వారున్నారు. కేవ‌లం త‌న‌కు అనుకూలంగా మెదిలేవారు..ఎంత‌టి నీచులైన‌, నీకృష్టులైనా వారిని ప్రొత్స‌హిస్తూ పార్టీని నాశ‌నం చేస్తున్నారు అనే అభిప్రాయం వ్య‌క్తం చేసేవాళ్లు పార్టీలో అధికులే ఉండ‌టం విశేషం. ఫ‌లితాల త‌ర్వాత టీడీపీ ఏ తీరం చేరుతుందో చూడాలి మ‌రి.

టీడీపీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎవ‌రి చేతిలోకి..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share