టీడీపీ నేత‌ల‌కు దేవినేని వార్నింగ్‌… రీజ‌న్ ఇదే..!

August 12, 2019 at 11:34 am

కృష్ణా జిల్లా టీడీపీలో ముస‌లం మ‌రింత‌గా ముదిరిపోయే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. రెండోసారి గెలిచిన ఎంపీ కేశినేని నానిని పార్టీలో ఏకాకిగా మార్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా ? అంటే ప్ర‌స్తుతం పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు అవున‌నే అనేలా ఉన్నాయి. ఇటీవ‌ల నాని పార్టీలో తీవ్రధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. పార్టీ అధిష్టానంపై నాని ఎప్పుడూ తీవ్ర‌మైన ధిక్కార స్వ‌రం వినిపిస్తూనే వ‌స్తున్నారు.

రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని శ్రీనివాస్‌(నాని) టీడీపీలో ఏకాకిగా మారుతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీలో నానిని ఒంట‌రిని చేసేందుకు తెర‌వెన‌క ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయ‌ట‌. పార్టీ కేడ‌ర్‌లో కూడా గంద‌ర‌గోళం ఏర్ప‌డ‌డంతో కొంద‌రు నానికి దూర‌మ‌వుతున్నారు. అటు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కంటే పార్టీలో ఆధిప‌త్య పోరుతోనే కాలం గ‌డిపేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఆయ‌న‌పై వ‌స్తున్నాయి.

నాని తాజా ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న తీరు కాస్త తేడాగా ఉంది. గెలిచిన వెంట‌నే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని, విజయవాడ వచ్చిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహాన్‌ను ఎంపీ కేశినేని ప్రత్యేకంగా కలిశారు. అదే అప్ప‌ట్లో పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాజాగా 370 ఆర్టిక‌ల్ ర‌ద్దుపై టీడీపీ బీజేపీకి స‌పోర్ట్ చేస్తే… నాని మాత్రం త‌ప్పుప‌ట్టారు.

ఉమా నిఘా….
ఇక కేశినేని భవన్‌కు వెళ్లే అర్బన్, జిల్లా నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమా నిఘా పెట్టినట్లు సమాచారం. అటువైపు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ఉమా హెచ్చిరిక‌ల‌కు భ‌య‌ప‌డి కూడా కేశినేని నాని ఆఫీస్‌కు లేదా ఆయ‌న్ను క‌లిసేందుకు భ‌య‌ప‌డుతున్నారు. ఇక గత ఐదేళ్లు టీడీపీ జిల్లా పార్టీ సమావేశాలు నిర్వహిస్తే ఎంపీ కేశినేని నాని తప్పని సరిగా హాజరయ్యేవారు. అయితే రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

నాని పార్టీలో ఉంటారా ? బ‌య‌ట‌కు వెళ్లిపోతారా ? అన్న దానిపై కూడా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అటు చంద్ర‌బాబు ఇప్ప‌టీకే ఆయ‌న్ను రెండు మూడుసార‌లు బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేసినా అవి కూడా ఫ‌లించిన‌ట్టు లేదు. ఆయ‌న త‌న‌కంటూ స‌ప‌రేట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసేకునే ప‌నిలో కూడా ఉన్నారు.

టీడీపీ నేత‌ల‌కు దేవినేని వార్నింగ్‌… రీజ‌న్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share