గుంటూరు టీడీపీలో రెండు బిగ్ వికెట్లు డౌన్..!

May 28, 2019 at 11:38 am

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి భారీ షాక్ తగులుతోందా ? అంటే ఇదే చ‌ర్చ ఇప్పుడు జిల్లాలో జోరుగా న‌డుస్తోంది. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ వస్తున్న సీనియర్ నేతలు తాజా ఫలితాలతో పూర్తిగా డీలాప‌డిపోయారు. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించార‌న్న చ‌ర్చ‌లు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఏపీలో వైసిపి ఏకంగా 151 సీట్లతో ఘనవిజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ వచ్చే ఐదేళ్లలో అయినా అన్న సందేహాలు చాలా మంది చేస్తున్నారు. లోకేష్‌ను నమ్ముకుంటే పార్టీ బతకడం కష్టమే అని డిసైడ్ అయిన సీనియర్ నేతలంతా ఇప్పుడు రాజకీయంగా తమ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, చంద్రబాబుకు నిన్న మొన్నటి వరకు రైట్ హ్యాండ్ గా ఉన్న మరో సీనియర్ నేత ఇప్పటికే బిజెపి నేతలతో చర్చలు ప్రారంభించినట్టు జిల్లాలో వార్తలు గుప్పుమంటున్నాయి. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా బీసీ మహిళ విడ‌దల రజనీ చేతిలో ఓడిపోయారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పుల్లారావుకు వ్యాపార పరమైన సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే పుల్లారావు కన్నా ద్వారా లాబీ చేసుకుని బీజేపీలోకి జంప్ చేసే ఏర్పాట్ల‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ ఓడిపోవడంతో స్థానికంగా ఉన్న టిడిపి కేడర్‌లో చాలామంది ఇప్పటికే రజనీకి దగ్గరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పుల్లారావు బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే బాబు రైట్ హ్యాండ్ య‌రపతినేని శ్రీనివాసరావు చూపులు సైతం బిజెపి వైపు ఉన్నట్టు తెలుస్తోంది. య‌రపతినేని బిజెపికి చెందిన ఓ ముఖ్య నేత ద్వారా ఫోన్ చేయించుకొని బిజెపి కీలక నేతను కలిసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే య‌రపతినేనిపై ఉన్న అక్ర‌మ మైనింగ్‌ కేసులతో పాటు… ఆయన గత చరిత్ర అంతా తెలుసుకున్న ఆ బీజేపీ ముఖ్య నేత ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇక గుంటూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వదిలే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా టిడిపికి కనీసం మరో పదేళ్లపాటు రాజకీయ భవిష్యత్తు లేదని నిర్ధారణకు వచ్చినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విచిత్రం ఏంటంటే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఈ కీలక నేతలు అంతా బిజెపిలోకి వెళ్లేందుకు రెడీగా ఉండటం విశేషం. ఇదే జరిగితే గుంటూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా ఉన్న టిడిపికి డౌన్ ఫాల్స్ స్టాట్ అయిన‌ట్టే. ఇదిలా ఉంటే తాజా ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సైతం అవినీతికి వ్యతిరేకంగా జగన్ పని చేస్తానంటే తాను సహకరిస్తానని చెప్పారు. జగన్ అవినీతి రహిత పాలనకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని డొక్కా చెప్పడంతో ఇప్పుడు డొక్కా కూడా పక్క చూపులు చూస్తున్నారు అన్న చర్చలు ప్రారంభమయ్యాయి.

వాస్తవానికి డొక్కాకు టిడిపిలోకి వెళ్లేముందు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆయ‌న‌ వైసిపిలోకి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్న టైంలో తన రాజకీయ గురువు రాయపాటి అడ్డుపుల్ల వేసి టిడిపిలో చేర్చారు. వాస్తవంగా చూస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పెట్టిన రాజకీయ బిక్ష వ‌ల్లే డొక్కా కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు మంత్రిగా కూడా ప‌ని చేశారు. డొక్కా ముందు వైసీపీలోకి వెళ్ళాలనుకున్నా రాయపాటి వల్లే టిడిపిలో చేరారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు తనకు రాజకీయ భవిష్యత్తు లేదు అన్న సందేహంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

గుంటూరు టీడీపీలో రెండు బిగ్ వికెట్లు డౌన్..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share