టీడీపీ బ్యాచ్‌: 23 మందిలో 11 మంది క‌మ్మ‌లే

May 25, 2019 at 3:25 pm

రాష్ట్రంలో అనూహ్య‌మైన రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అప్ర‌తిహ‌త విజ‌యాన్ని తాను సొం తం చేసుకుంటాన‌ని చెబుతూ వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల్లో బొక్క‌బోర్లా ప‌డ్డారు. పాద‌యాత్ర కావొ చ్చు మార్పు నినాదం కావొచ్చు, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే విజ్ఞ‌ప్తి కావొచ్చు.. ఏదేమైనా.. వైసీపీ దూకుడు ముందు సైకిల్ చక్రా ల‌కు గాలి పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేక‌త ప‌వ‌నాలు చంద్ర‌బాబును ఊపిరాడ‌నివ్వ‌కుండా చేశాయి. మొత్తం కేవ‌లం 175లో 23 స్థానాల్లోనే టీడీపీ విజ‌యం సాధించింది. ఇక‌, ఎంపీల విష‌యానికి వ‌స్తే.. మొత్తం పాతిక మంది ఎంపీల్లో ముగ్గురు మాత్ర‌మే టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వ్య‌తిరేక‌త తీవ్రంగా క‌నిపించింది. ప్ర‌జ‌లు ఆ పార్టీని పూర్తిగా తిప్పికొట్టారు. అయితే, ఇంత వ్య‌తిరేకత న‌డుమ కూడా .. చంద్ర‌బాబు సొంత సామాజిక వ‌ర్గం క‌మ్మ వారు మాత్రం ఈ పార్టీకి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అండ‌గా నిలిచారు. ఓట్లు కుమ్మ‌రించారు. త‌మ మ‌ద్ద‌తు చంద్ర‌బాబుకేన‌ని చెప్పారు. ఇలా రాష్ట్రంలో టీడీపీ ద‌క్కించుకు న్న మొత్తం 23 స్థానాల్లో 11 చోట్ల చంద్ర‌బాబు సొంత సామాజిక వ‌ర్గం క‌మ్మ ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో కొంద‌రు వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తో కూడా నెట్టుకొచ్చారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా క‌మ్మ‌వ‌ర్గానికి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. కుప్పం నుంచి చంద్ర‌బాబు, హిందూపురం నుంచి బాల‌య్య‌, విశాఖ తూర్పు వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌, రాజ‌మండ్రి గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గం గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రిలు విజ‌యం సాధించారు.

ఇక‌, మండ‌పేట వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు, కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నుంచి వ‌ల్ల‌భ‌నేని వంశీ, విజ‌య‌వాడ తూర్పు నుంచి గ‌ద్దె రామ్మోహ‌న్‌, ప్ర‌కాశంలో ఏకంగా ముగ్గురు గెలిచారు. ప‌రుచూరు నుంచి ఏలూరి సాంబ‌శివ‌రావు, అద్దంకి నుంచి గొట్టిపాటి ర‌వికుమార్‌, చీరాల నుంచిక‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి విజ‌యం సాధించారు. ఇక‌, అనంత‌పురంలో ఉర‌వ‌కొండ నుంచి ప‌య్యావుల‌కేశ‌వ్ గెలుపు గుర్రం ఎక్కారు. ఇలా మొత్తంగా 11 మంది క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారే విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి క‌మ్మ వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశంలో కూడా ఈ ద‌ఫా టీడీపీకి దెబ్బ‌కొట్టినా .. ఈ ప‌ద‌కొండు మంది మాత్రం త‌మ తమ సొంత ఇమేజ్ స‌హా స్థానికంగా ఉన్న బ‌లంతో గెలుపు గుర్రాలు ఎక్క‌డం గ‌మ‌నార్హం.

అదే స‌మ‌యంలో టీడీపీకి ద‌క్కిన మూడు ఎంపీ స్థానాల్లోనూ ముగ్గురూ క‌మ్మ వారే కావ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌వాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్ వ‌రుస‌గా రెండోసారి గెలిచారు. ఇక వైసీపీ నుంచి జ‌గ‌న్ 10 మంది క‌మ్మ‌ల‌కు సీట్లు ఇస్తే వారిలో ఆరుగురు అసెంబ్లీకి గెలిచారు. వీరిలో కొఠారు అబ్బ‌య్య చౌద‌రి (దెందులూరు), వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ (మైల‌వ‌రం), కొడాలి నాని(గుడివాడ‌), నంబూరు శంక‌ర‌రావు (పెద‌కూర‌పాడు), బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు (వినుకొండ‌), అన్నాబ‌త్తుని శివ‌కుమార్ (తెనాలి) ఉన్నారు. వైసీపీ నుంచి మూడు చోట్ల ఎంపీలుగా పోటీ చేసిన క‌మ్మ‌ల‌లో విశాఖ నుంచి ఎంవీవీ.స‌త్య‌నారాయ‌ణ‌, న‌ర‌సారావుపేట నుంచి లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు గెలిచారు.

టీడీపీ బ్యాచ్‌: 23 మందిలో 11 మంది క‌మ్మ‌లే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share