బాబు ప‌రువు పాయే… టీడీపీకి 11 మంది కీల‌క నేత‌ల గుడ్ బై…!

June 14, 2019 at 12:12 pm

ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని నవ్యాంధ్ర రెండో సీఎం జగన్మోహన్ రెడ్డి అక్షరాల పాటించేందుకు రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన 67 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు బలవంతంగా తమ పార్టీలోకి లాక్కున్నారు. వీరిలో కొంతమందికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం అసెంబ్లీలో టిడిపికి ప్రతిపక్షం లేకుండా చేసేందుకు… ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారా ? అంటే ఆ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అవున‌నే అంటున్నాయి.

అయితే టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు కండీష‌న్ మాత్రం ఉంటుంది. పార్టీ మారే వారు టిడిపి ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు వైసీపీలో చేరేందుకు జగన్ అంగీకరించే ఛాన్సులు ఉన్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. చంద్రబాబు ఇప్పటికీ అయినా మారతారని ఆశిస్తున్న‌ ఎమ్మెల్యేలకు నమ్మకం కలగడం లేదు. బాబు తర్వాత టిడిపిని నడిపించే నాయకుడు ఎవరైని ప్రశ్నిస్తే లోకేష్ కు అంత సీన్ లేదని ఇప్పటికే అర్థమైంది. దీంతో వారంతా వైసీపీలో చేరేందుకు ఆ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు న‌డుపుతున్నార‌ని తెలుస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్పటికే చంద్రబాబు నాయకత్వంపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని…. తమతో ఎనిమిది మంది టిడిపి ఎమ్మెల్యేలు, ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని… ఓకే చెబితే వీళ్లంతా తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కోటంరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు చంద్ర‌బాబు అర్జెంటుగా ఎలెర్ట్ అవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. తాను ఏ మాత్రం నిర్ల‌క్ష్యంగా ఉన్నా ఐదేళ్ల పాటు త‌మ పార్టీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ఉంటార‌న్న గ్యారెంటీ లేద‌న్న నిర్ణ‌యానికి చంద్ర‌బాబు కూడా వ‌చ్చేశార‌ట‌. ఏదేమైనా ఆరు నెల‌ల్లోనే టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది గూడ దూకేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. అయితే వీరు పద‌వుల‌కు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వు. మ‌రి ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి డెసిష‌న్ ఎలా ఉంటుందో ? చూడాలి.

బాబు ప‌రువు పాయే… టీడీపీకి 11 మంది కీల‌క నేత‌ల గుడ్ బై…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share