టీడీపీలో ఆ మంత్రికి నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ట‌..ఎవరో తెలుసా!

May 14, 2019 at 11:25 am

ఆయ‌న మంత్రి. టీడీపీలో సీనియ‌ర్ నేత‌. పైగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు. ఎన్ని ఎదురు దెబ్బ‌లు తిన్నా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, తాజాగా ముగిసిన ఎన్నిక‌లు కూడా ఆయ న‌ను ముప్పు తిప్పలు పెడుతున్నాయ‌ని అంటున్నారు ఆ మంత్రిగారి అనుచ‌రులు. పోలింగ్‌కు ముందు దాదాపు నెల రోజులుగా నిద్ర‌లేని రాత్రులు గ‌డిపిన ఆయ‌న.. పోలింగ్ త‌ర్వాత కూడా కంటిపై కునుకులేకుండా తిరుగుతున్నా ర‌ట‌. రిజ‌ల్ట్ తేదీ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఒక‌టికి రెండు సార్లు కేలండ‌ర్లు చూసుకుంటున్నార‌ట‌. చిత్రంగా ఉంది క‌దూ.. ఇంత‌కీ ఆయ‌నెవ‌రంటే.. మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. 

ఎన్నిక‌ల్లో తొలిసారి పోటీ చేసిన వారికి ఉండే ఆత్రానికి రెండు రెట్లు ఎక్కువ‌గానే ఆయ‌న ఆరాట ప‌డుతున్నార‌ని అనుచ‌రులు చెబుతున్నారు. నిజానికి ఆయ‌న చాలా సీనియ‌ర్ దాదాపు 35 ఏళ్లుగా టీడీపీలో ఉన్నారు. అన్న‌గారి హ‌యాం నుంచి ఇప్పుడు బాబు కాలం వ‌ర‌కు ఆయ‌న పార్టీకి విధేయుడిగా ఉన్నారు. కానీ, ప్ర‌జాక్షేత్రంలో మాత్రం వ‌రుస‌గా డింకీలు కొడుతున్నారు. ఇప్ప‌టికి నాలుగు ఎన్నిక‌ల్లో అంటే దాదాపు 20 ఏళ్లుగా సోమిరెడ్డి ప‌రాజ‌యం పాల‌వుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్ర‌య‌త్నించ‌డం, చివ‌రి నిముషంలో ఆశ‌లు గ‌ల్లంతు కావ‌డంతో ఆయ‌న ఓట‌మిని కౌగిలించుకుని ఉన్నార‌నే వ్యాఖ్య‌ల‌ను సొంత చేసుకున్నారు. 

ఇక‌, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో సోమిరెడ్డి చాలా అస్త్రాల‌నే ప్రయోగించారు. ఎన్నిక‌ల‌కు రెండు ఏళ్ల‌కు ముందుగానే త‌న కుమారుడు రాజ‌గోపాల్‌రెడ్డిని రంగంలోకి దింపారు. వాస్త‌వానికి కుమారుడినే ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో దింపాల‌ని అనుకున్నా.. చంద్ర‌బాబు ఓకే చెప్ప‌క‌పోవ‌డంతో తానే మ‌రోసారి ఎన్నిక‌ల్లోకి దిగారు. కుమారుడో ఊరూవాడా ప్ర‌చారం చేయించారు. అనేక హామీలు ఇప్పించారు. వ్య‌వ‌సాయ మంత్రిగాత‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రైతుల రుణ‌మాఫీల‌ను ముందుగా తీర్చేశా రు. అదేవిధంగా సానుభూతి కోసం ఎన్నిక‌ల‌కు ముందుగానే ఆయ‌న త‌న మంత్రిప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించారు. 

ఇక‌, సోమిరెడ్డి పోటీ చేసిన స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌ను ఏకేశారు., క్రికెట్ బెట్టింగులు ఆడేవారు కావాలా? ప‌్ర‌జాసేవ చేసే వారు కావాలా? అంటూ.. టీడీపీ అనుకూల మీడియాలోనూ ప్ర‌చారం చేయించారు. చంద్ర‌బాబు ప‌థ‌కాలైన ప‌సుపు కుంకుమ‌, అన్న‌దాత సుఖీభ‌వ‌ల‌కు పెద్ద‌పీట వేశారు. ఇలా అనేక రూపాల్లో ఆయ‌న త‌న గెలుపు కోసం విశేషంగా పోరాడారు. అయిన‌ప్ప‌టికీ.. గ‌త 20 ఏళ్లుగా ల‌భించ‌ని విజ‌యం ఇప్పుడు సొంత‌మ‌వుతుందా?  లేదా? అనే విష‌యంపై మాత్రం ఆయ‌న నిత్యం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. తాను నిద్ర పోకుండా త‌న ప‌క్క‌నుండే వారికి నిద్ర‌ప‌ట్ట‌కుండా కూడా చేస్తున్నార‌ట‌!! మ‌రి ఏం జ‌రుగుతుందో.. ఎప్పుడు కంటి నిండా నిద్ర‌పోతారో చూడాలి. 

 
టీడీపీలో ఆ మంత్రికి నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ట‌..ఎవరో తెలుసా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share