రిజల్ట్ రాక ముందే టీడీపీకి మరో భారీ షాక్

April 13, 2019 at 5:32 pm

వైఎస్ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలోని వైసీపీలోకి ఎన్నిక‌ల త‌ర్వాత కూడా వ‌ల‌స‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట శాస‌న‌స‌భ‌కు, లోక్‌స‌భ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి అన్ని రంగాల ప్ర‌ముఖులు పోటీ ప‌డ్డారు. జ‌గ‌న్ పార్టీకి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి చేరిక‌లు బాగా జ‌రిగాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ఎన్నిక‌లు ముగిశాయి. జ‌గ‌న్‌పార్టీకి వ‌చ్చిన ప్ర‌జాద‌ర‌ణ‌కు చంద్ర‌బాబు స‌హా ఆయ‌న టీం మొత్తం ఆత్మ‌శోధ‌న‌లో పడ్డారు. మీడియా ముందు ఎదేదో చెబుతూనే ఉన్న విష‌యం తెలిసిందే.

అధికారంలో ఉన్న పార్టీకి వ‌ల‌స‌లు జ‌ర‌గ‌డం సాధార‌ణ‌మే కానీ, ప్ర‌తిప‌క్ష పార్టీకి అందునా ఎన్నిక‌ల త‌ర్వాత కూడా వ‌ల‌స‌లు జ‌ర‌గ‌డం మామూలు విష‌యం కాదు. అందునా తెలుగుదేశం వంటి అధికారంలో ఉన్న పార్టీ నుంచి పేరున్న గొప్ప నాయ‌కుడు జ‌గ‌న్ పార్టీలోకి చేర‌డం అసాధార‌ణ విష‌య‌మే. క‌రుడ‌గ‌ట్టిన తెలుగుదేశం పార్టీ నేత క‌మలాపురం మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి వైసీపీలో చేరారు. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే వైసీపీలోకి చేరిన మొద‌టి వ్య‌క్తి వీర‌శివారెడ్డే.

2019ఎన్నిక‌ల్లో వీర‌శివారెడ్డి క‌మ‌లాపురం టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో శివారెడ్డి అలిగారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా స‌రిగా పాల్గొన‌లేదు. ఎన్నిక‌ల త‌ర్వాత ఎమ్మెల్సీ ఇస్తాన‌ని అధినేత హామీ ఇచ్చినా వీర‌శివారెడ్డి సంత్రుప్తి చెంద‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీ క‌మ‌లాపురం ఎమ్మెల్యే అభ్య‌ర్థి ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి, క‌డ‌ప మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. వైఎస్‌జ‌గ‌న్ త‌ప్ప‌కుండా సీఎం బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు.

రిజల్ట్ రాక ముందే టీడీపీకి మరో భారీ షాక్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share