ఆ న‌లుగురికి ఓట‌మి భ‌యం…ఓడిపోతే పరువు పాయె !

April 13, 2019 at 11:50 am

రాజ‌కీయ రంగానికి..సినీ రంగానికి చాలా ద‌గ్గ‌రి సంబంధాలున్నాయి. తెలుగు నేల‌పై ఈ రెండు రంగాల్లో రాణించిన వారికి జ‌నాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూ వ‌స్తున్నారు. ఎన్టీఆర్ వంటి మ‌హానుభావుడు రెండు రంగాల్లో త‌న‌దైన బ‌ల‌మైన ముద్ర‌వేయ‌గ‌లిగారు. ఆయ‌న స్ఫూర్తితో అనేక మంది సినీ ప్ర‌ముఖులు రాజ‌కీయ రంగంలోకి అడుగుపెట్టారు. గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా ప‌నిచేసుకుంటూ వెళ్తున్న‌వారూ ఉన్నారు. సుధీర్ఘ‌కాలంగా త‌మ స‌త్తా చాటిన ఒక‌రిద్ద‌రు నేత‌లూ ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ప‌లువురు సినీ తార‌లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. అందులో ప్ర‌ముఖుడు జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ప‌వ‌న్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అందులో ఒక‌టి భీమ‌వ‌రం..రెండోది గాజువాక‌. భీమ‌వ‌రంలో ఆయ‌న గెలుపుపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ముందు అనుకున్నంత‌గా ఎన్నిక‌ల నాటికి ప‌వ‌న్ ప్ర‌భావం క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నించాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. దీనికితోడు ఆయ‌న ప్ర‌చారంపై ఇక్క‌డ పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేద‌ని కేవ‌లం కాపు, అభిమానుల ఓట్ల‌పైనే ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. అందులోనూ చీలిక‌లు క‌నిపిస్తుండ‌టంతో ఆయ‌న గెలుపు అంత సులువు కాద‌ని స‌మాచారం. అయితే గాజువాకలో మాత్రం మంచి మెజార్టీతో గెలిచే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

ఇక ఆయ‌న అన్న నాగ‌బాబు విష‌యానికి వ‌స్తే జ‌న‌సేన పార్టీ నరసాపురం ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఇక్క‌డ ఆయ‌న‌కు బలమైన అభ్యర్థులు ఎదుర్కొవాల్సి రావ‌డం, లేటుగా టికెట్ క‌న్ఫ‌ర్మ్ కావ‌డం, ప్రచారానికి త‌క్కువ స‌మ‌యం కేటాయించ‌డం, సొంతంగా ఆయ‌న‌కు అభిమానులు, అనుచ‌ర‌గ‌ణం లేక‌పోవ‌డం వంటి అంశాల‌తో రేస్‌లో ఆయ‌న వెన‌క‌బ‌డిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే, సినీ హీరోయిన్ రోజా ఈసారి గడ్డు పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. రోజాకు నగరిలో ఈ సారి ప్రతికూల పవనాలు వీస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రోజా ప‌నితీరు బాగోలేక‌పోవ‌డం, ఆమె నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేక‌పోవ‌డం వంటి అంశాలు ఆమెకు మైన‌స్‌గా మారిన‌ట్లు తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే హిందూపురంలో ఆయ‌న‌పై మొదటి నుంచి వ్యతిరేకత ఉంది. బావ చంద్రబాబు సీఎంగా ఉన్నా బాలకృష్ణ మాత్రం నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదనే అభిప్రాయం ప్రజల్లో నెల‌కొని ఉంది. బాల‌య్య‌పై కోపాన్ని ఓటు రూపంలో తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా ఆ న‌లుగురికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు స‌మాచారం. మే 23 వ‌ర‌కు ఆగితే గాని వీరి భ‌విష్య‌త్ ఏంట‌న్న‌ది తెలియ‌దు.

ఆ న‌లుగురికి ఓట‌మి భ‌యం…ఓడిపోతే పరువు పాయె !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share