మ‌హా ఫైట్‌లో మైల‌వ‌రం తీర్పు ఎటు..?

May 13, 2019 at 3:03 pm

రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిసి నెల రోజులు గ‌డిచినా.. ఉత్కంఠ మాత్రం విప‌రీతంగా కొన‌సాగుతోంది. రాష్ట్రంలో పోలింగ్ జ‌రిగిన తీరు, దీనికి ముందు రోజు ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు పంచిన న‌గ‌దు నేప‌థ్యంలో చాలా నియోజ‌క‌వ‌ర్గా ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీల మ‌ధ్య నువ్వా నేనా అనే రేంజ్‌లో ఎన్నిక‌ల యుద్ధం జ‌రిగింది. ఇక‌, మంగ‌ళ‌గిరి, పులివెందుల‌, భీమిలి, గాజువాక, చీరాల‌, ప‌రుచూరు వంటి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల పోరు మ‌రింత తీవ్రంగా సాగింది. నువ్వా-నేనా అనేరేంజ్‌లో సాగిన ఈ ఎన్నిక‌ల పోరులో అభ్య‌ర్థుల గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఇలానే న‌రాలు తెగే ఉత్కంఠను చ‌విచూస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కృష్ణాజిల్లాలోని మైల‌వ‌రం.

ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు గెలుస్తూ వ‌చ్చారు. ఇప్ప‌టికి ఆయ‌న రెండు సార్లు విజ‌యం సాధించారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని నిర్ణ యించుకున్నారు. ఇక‌, చంద్ర‌బాబు వ‌ద్ద మంచి మార్కులు కొట్టేయ‌డంతో పాటు త‌న మాట‌ల చ‌తుర‌త‌తో ప్ర‌ధాన విప క్షం వైసీపీపై నిప్పులు చెరిగారు. ఇక, చంద్ర‌బాబు అప్ప‌గించిన ప‌నిని పూర్తిస్థాయిలో నిర్వ‌హిస్తూ.. ఆయ‌న ద‌గ్గ‌ర రాముడు మంచి బాలుడుటైపులో గుర్తింపు పొందారు. ఈ క్ర‌మంలోనే తాజా ఎన్నిక‌ల్లోగెలిచి మైల‌వ‌రం పీఠాన్నిసుస్థిరం చేసుకోవాల‌ని దేవినేని డిసైడ్ అయ్యారు.

అయితే, దేవినేనికి చెక్ పెట్టాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకుంది. దేవినేని హ్యాట్రిక్‌కు ఎట్టిప‌రిస్థితిలోనూ అడ్డు త‌గిలి త‌మ స‌త్తా చాటాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు.ఈ క్ర‌మంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యు డు కృష్ణ‌ప్ర‌సాద్ ను వైసీపీలోకి చేర్చుకుని ఆయన కోరిక‌, త‌మ వ్యూహం అమ‌లులో భాగంగా జ‌గ‌న్‌.. మైల‌వ‌రం టికెట్‌ను కేటాయించారు. ఇక‌, ఏడాది ముందు నుంచి కూడా వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ హోరా హోరీగా ప్ర‌చారం చేశారు. ముఖ్యంగా దేవినేనిని టార్గెట్ చేసిన ఆయ‌న ఎట్టిప‌రిస్థితిలోనూ త‌న గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లిసి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు సాగారు.

ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యానికి అటు దేవినేని, ఇటు వ‌సంతలు మ‌రింత జోరు పెంచారు. వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల వ‌ర‌కు కూడా వెళ్లిపోయింది. నువ్వా నేనా అనే రేంజ్ మ‌రింత పెరిగింది. ఈ క్ర‌మంలోనే ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్య ధోర‌ణి పెంచుకు న్నారు. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తానికి భిన్నంగా భారీ ఎత్తున పోటీ పెరిగిపోయింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల కంటే.. కూడా ఇప్పుడు 2% పోలింగ్ త‌గ్గిన‌ప్ప‌టికీ భారీగానేపోలింగ్ జ‌రిగింది. వైసీపీ స‌భ‌ల‌కు అడ్డంకులు, పోలీసుల లాఠీ చార్చీ… పోలింగ్ ముందు రోజు న‌గ‌దు పంపిణీ వంటి అంశాలు.. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడుతారు? అనే చ‌ర్చను మ‌రింత పెంచాయి.

మ‌హా ఫైట్‌లో మైల‌వ‌రం తీర్పు ఎటు..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share