జ‌గ‌న్ దూకుడు వెనుక రీజ‌న్ మ‌రొక‌టి ఉందా..?

July 20, 2019 at 11:26 am

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వ‌స్తాయో? ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు తెర‌మీద క‌నిపిస్తాయో..? చెప్ప‌డం చాలా క‌ష్టం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో వ్య‌క్తిగ‌త ఆవేశాలు, ఆవేశాల‌కు పెద్ద‌పీట ప‌డుతోంది. ము ఖ్యంగా ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ.. చంద్ర‌బాబును వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ టార్గెట్ చేశారు. ఏ విష‌యాన్ని ప‌ట్టుకున్నా చంద్ర‌బాబును ఆయ‌న పార్టీ నాయ‌కుల‌ను దులిపేస్తున్నారు. అంతేకాదు, అవినీతి జ‌రిగింద‌ని, గ‌త పాల‌న అంతా అనుభ‌రాహిత్య‌మేన‌ని చెప్పే దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న ఒక అవినీతి పుట్ట‌! అనే చ‌ర్చ ప్ర‌జ‌ల్లో విస్తృతంగా సాగేలా వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

2014 ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబు జై కొట్టారు. ఆయ‌న అనుభ‌వం రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌ని భావించారు. అయ‌తే, ప్ర‌త్యేక హోదా, కాపుల రిజ‌ర్వేష‌న్‌, రాజ‌ధాని నిర్మాణం వంటి కీల‌క విష‌యాలు స‌హా త‌మ్ముళ్ల అవినీతిని అరిక‌ట్ట‌డంలో ఆయ‌న ఓ మేర‌కు విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. అంతే త‌ప్ప మొత్తం పాల‌నంతా కూడా అవినీతి మ‌యం అని చెప్ప‌డానికి అవ‌కాశం ఇవ్వ‌లేదు. అయితే, ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న జ‌గ‌న్ మాత్రం త‌న పార్టీ ప్ర‌భుత్వాన్ని ప‌దిలం చేసుకోవ‌డంతోపాటు.. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా చేసుకోవాల‌నేది ఆయ‌న ప్ర‌ధాన ఉద్దేశంగా క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఒక మంచి కుక్క‌కి. `పిచ్చి కుక్క‌` అని ముద్ర వేయ‌డం ద్వారా ప్ర‌జ‌లే రాళ్ల‌కొట్టే ప‌రిస్థితి వ‌చ్చేలా.. ఇప్పుడు టీడీపీని ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మొత్తంగా ఈ ఎపిసోడ్‌ను చూస్తే… సీఎం జ‌గ‌న్ వ్యూహం కేవలం బాబును మాత్ర‌మే టార్గెట్ చేయ‌డం కాద‌ని, ఆయ‌న పార్టీని ల‌క్ష్యంగా చేసుకుని, చేస్తున్న దాడిగా పేర్కొంటున్నారు మేధావులు. అన్ని రూపాల్లోనూ టీడీపీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించ‌డం, ప్ర‌జాక్షేత్రంలో దోషిగా నిల‌బెట్ట‌డం వెనుక రాజ‌కీయంగా జ‌గ‌న్ చాలానే ల‌బ్ధిని కోరుకుంటున్నార‌ని అంటున్నారు.

ఒక్క‌సారి రెండేళ్ల కింద‌కి వెళ్తే.. ఇదే చంద్ర‌బాబు. అప్ప‌ట్లో రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అవ‌స‌ర‌మా? అంటూ బ‌హిరంగంగానే వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఆయ‌న త‌న వ్యూహాన్ని మాత్రం అమ‌లు చేసుకోలేక పోయారు. ప్ర‌జ‌ల నుంచి ప్ర‌జాస్వామ్య వాదుల నుంచి కూడా ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొన్నారు. అయితే, దీనికి భిన్నంగా ఇప్పుడు జ‌గ‌న్‌.. భ‌విష్య‌త్తులో ప్ర‌జ‌లే ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీని తిప్పికొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు మేధావులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

జ‌గ‌న్ దూకుడు వెనుక రీజ‌న్ మ‌రొక‌టి ఉందా..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share