టీజేఎస్‌కు దెబ్బ మీద దెబ్బ

December 3, 2018 at 1:08 pm

టీజేఎస్‌కు దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో ఏర్ప‌డిన జేఏసీ పునాదుల‌పై కొద్దినెల‌ల క్రితం ఏర్పాటైన తెలంగాణ జ‌న స‌మితి కూలిపోయే స్థితికి చేరుకుంటోంది. స్తంభం లాంటి నేత‌లు అసంత్రుప్తితో ఒక్కోరు పార్టీని వీడుతున్నారు. ఈ పార్టీ నుంచి ముఖ్య‌నేత‌లు కొంత‌మంది తాము కాని, త‌మ త‌రుపున ఉన్న కొంత‌మందికి టికెట్లు ఇవ్వాల‌నే ష‌ర‌తుతో పార్టీలో వ‌చ్చి చేరారు. ఆ ఆశ‌తోనే చాలా మంది నేత‌లు అన్నీ తామై జ‌న క్షేత్రంలోకి వెళ్లారు..పార్టీని తీసుకెళ్లారు. చివ‌రికి ప్ర‌భుత్వం నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న‌లు ఎదురైనా.. అనుకున్న‌న్నీ కాకున్నా రెండు మూడు స‌భ‌ల‌తో టీజేఎస్‌ జ‌నం ద్రుష్టిని ఆక‌ర్షించింది…కొద్దిగా పేరేచ్చే స‌మయానికి కాంగ్రెస్ నేత‌ల క‌న్ను కోదండ‌రాంపై ప‌డింది.Kodandaram_TJS_Facebook

వారి విల్లుగుండా కోదండ‌రాం అనే బాణాన్ని కేసీఆర్‌పై ఎక్కుపెట్టారు. అయితే రామ‌బాణం కాక‌పోయినా కొద్దోగొప్పో ప‌నిచేసింది. మిత్రులం అవుదామ‌ని న‌మ్మించిన కాంగ్రెస్ కూట‌మి అనే ప్ర‌తిపాద‌న‌ను తీసుకొచ్చింది. కొద్దో గొప్పో ఉన్న ఓట్ల‌కు కాంగ్రెస్ క్యాడ‌ర్ తోడ‌యితే ఇక మ‌న‌కు దాదాపు 20సీట్లు గెల‌వ‌వ‌చ్చ‌ని ఊహాచిత్రం గీసుకున్నాడు కోంద‌డ‌రాముడు. అయితే మూడు నెల‌ల పాటు ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌ల‌తో కాంగ్రెస్ నాన్చి…చివ‌ర‌కు కోదండ‌రాంను తుగ్ల‌క్‌ను చేసింది..ఎట్ట‌కేల‌కు క‌నీసం ఆయ‌న్ను బ‌రిలో కూడా దిగ‌కుండా చేయ‌గ‌లిగింది. కాంగ్రెస్‌పై ఆధార‌ప‌డ్డ కోదండ‌రాం…సొంత పార్టీ నేత‌ల మ‌నోభావాల‌ను, క‌ష్టాన్ని విస్మ‌రించాడు. పార్టీ నేత‌లు సూచించిన 20 సీట్ల డిమాండ్ గంగలో క‌ల‌సి..ముష్టి 5సీట్ల‌తో అదికూడా కాంగ్రెస్ వీక్‌గా ఉన్న ప్రాంతాల్లో టీజెఎస్‌కు ఇచ్చింది.dc-Cover-0luiapha8kb7egk97vgoo6mso1-20181203023915.Medi

మిత్ర‌ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను ఏం చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో కోదండ‌రాం ఉండ‌గా…కోదండ‌రాంపై న‌మ్మ‌కంతో పార్టీలో చేరిన వారు ఆగ్ర‌హావేశాలు..అసంత్రుప్తితో పార్టీని వీడుతున్నారు. ఎవరీష్టానుసారం వారు కోదండపై టికెట్లు అమ్ముకున్నార‌ని, కూట‌మికి క‌ట్టుబానిస‌గా మారార‌ని ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం టీజేఎస్ ఉపాధ్య‌క్షురాలు ర‌చ‌నారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆమెతోపాటు మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి త‌న‌యుడు ఆదిత్య‌రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఆమె కోంద‌డంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆత‌ర్వాత ఆ పార్టీ ఆమెను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిందనుకోండి. అయితే ఇప్పుడు టీజేఎస్ ప‌రిస్థితి ఏంటీ అంటే..కూలిపోవ‌డానికి సిద్ధంగా ఉన్న భ‌వ‌నమ‌ని ఆ పార్టీ నేత‌ల నుంచే స‌మాధానం వ‌స్తోంది…పార్టీ మూడు నాళ్ల ముచ్చ‌టే అయింది.. ఆదిలోనే టీజేఎస్ తుస్సుమంటుండ‌టంపై తెలంగాణ ప్ర‌జ‌లు పెద‌వి విరుస్తున్నారు.

టీజేఎస్‌కు దెబ్బ మీద దెబ్బ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share