ఎంపీ పొంగులేటి టీఆర్ఎస్ కు గుడ్ బై ?

March 23, 2019 at 11:59 am

తెలంగాణ రాష్ర్టంలోని ఖ‌మ్మం జిల్లాలో రాజ‌కీయాలు రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి.. మొన్న‌టి మొన్న తెలుగుదేశం, కాంగ్రెస్‌ల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, ఇత‌ర ఉన్న‌త స్థాయి అధికారులు పార్టీల‌ను వీడి తెలంగాణ రాష్ర్ట స‌మితిలో చేరారు. టీడీపీ నుంచి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు టీఆర్ ఎస్‌లో చేరారు. చేరిన వెంట‌నే నామాకు కేసీఆర్ ఎంపీ టిక్కెట్ట్ కేటాయించారు. అదే స్థానంలో ప్ర‌స్తుత ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. నామాకు టిక్కెట్ ఇవ్వ‌డంతో పొంగులేటి పార్టీ మారే యోజ‌న‌లో ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

టీఆర్ ఎస్ జిల్లా స్థాయి టీఆర్ ఎస్ నేత‌ల స‌మావేశానికి గైర్హ‌జ‌ర్ అయ్యారు. అదే స‌మ‌యంలో శ్రీ‌నివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఒక‌వైపు కాంగ్రెస్ పార్టీ ఖ‌మ్మం ఎంపీ టిక్కెట్‌ను ఎవ‌రికీ కేటాయించ‌క‌పోవ‌డం కూడా ఆలోచించేదిగా ఉంది. టీఆర్ ఎస్ టిక్కెట్ ఇవ్వ‌క‌పోవ‌డం, కాంగ్రెస్ స్థానం ఇంకా ఖాళీగా ఉండ‌డంతో పొంగులేటి చేరిక లాంఛ‌న‌మే అంటున్నారు.

కాగా, గ‌తంలోనూ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలోని వైసీపీ అభ్య‌ర్థిగా గెలుపొందారు. అప్పుడు జ‌రిగిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో పార్టీని వీడి తెలంగాణ రాష్ర్ట స‌మితిలో చేరిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత పొంగులేటి ఆ పార్టీ రాజ‌కీయాల‌కు అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఈ మ‌ధ్య కాలంలో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ టిక్కెట్‌పై బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల‌కు కాకుండా వేరే వారికి మ‌ద్ద‌తుగా నిలిచిన‌ట్టు కూడా అప‌వాదును మోస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అధినేత కేసీఆర్ ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తుంది. మొత్తంగా అల‌క‌బూనిన పొంగులేటి కాంగ్రెస్ వైపు చూస్తున్న విష‌యం అర్థ‌మ‌వుతోంది.

ఎంపీ పొంగులేటి టీఆర్ఎస్ కు గుడ్ బై ?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share