టీడీపీకి మ‌రో షాక్‌.. జ‌న‌సేన‌లోకి వంగ‌వీటి!

June 24, 2019 at 3:54 pm

రాష్ట్రంలో విపక్షంగా ఉన్న టీడీపీకి దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ పార్టీకి కూసాలు క‌దులుతున్నాయా? అ నేంత రేంజ్‌లో ప‌రిస్తితి మారుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కాపు సామాజిక వ‌ర్గం టీడీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చే ప‌రిస్థితి నెల కొంది. త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని చెప్పి.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోలేద‌నే ఆగ్ర‌హంతో ఉన్న కాపునాయ‌కులు పార్టీ మారిపోయేందుకు రెడీ అయిన విష‌యం వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టికే కాకినాడ కేంద్రంగా కాపు నాయ‌కులు స‌మావేశం కూడా నిర్వ‌హించారు. దీంతో దాదాపు వీరంతా బీజేపీలోకి జంప్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇదిలావుంటే, కాపు వ‌ర్గానికే చెందిన విజ‌య‌వాడ నాయ‌కుడు, దివంగ‌త వంగ‌వీటి రంగా త‌న‌యుడు, వంగ‌వీటి రాధా కూడా టీడీపీకి బై చెప్పేందుకు రెడీ అయ్యార‌ని అంటున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరేందుకే ఆయన పవన్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. వంగ‌వీటి రంగా కాంగ్రెస్‌లో కీల‌క రాజ‌కీయ రోల్ పోషించారు. ఆయ‌న వార‌సుడిగా రంగంలోకి వ‌చ్చిన రాధా.. విజ‌య‌వాడ నుంచి 2004లో విజ‌యం సాదించారు. ఇక‌, 2009లో ఆయ‌న వేసిన రాంగ్ స్టెప్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను రాజ‌కీయంగా కోలుకోలేకుండా చేసింది.

దూకుడు, ఆలోచ‌న లేనిత‌నం, ఎవ‌రు చెప్పినా విన‌ని మ‌న‌స్త‌త్వంతో రాధా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును తానే పాడు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌జారాజ్యంలోకి వెళ్లి రాధా.. అక్క‌డ ఓట‌మితో కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. త‌ర్వాత జ‌గ‌న్ పార్టీ వైసీపీలోకి వ‌చ్చారు. 2014లో ఈ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీలోనే కొన‌సాగినా.. 2019 ఎన్నిక‌ల్లో సెంట్ర‌ల్ టికెట్ కోసం ప‌ట్టుబ‌ట్టి.. జగన్‌తో విభేదించిన వంగవీటి రాధాకృష్ణ ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అదేస‌మ‌యంలో చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని మూడు రోజుల పాటు శ్రీయాగం కూడా చేశారు. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు.

అయితే.. అనూహ్య విజయంతో వైసీపీ అధికారంలోకి రావడం, టీడీపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావడంతో వంగవీటి రాధా ప‌రిస్తితి అగ‌మ్య‌గోచ‌రంగా మారిపోయంది. ఒక‌ప‌క్క‌, టీడీపీకి చెందిన కాపు నేతలు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వంగవీటి కూడా తన దారి తాను చూసుకోవాలని భావించినట్లు సమాచారం. వైసీపీలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జనసేనలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ త‌న పార్టీకి సంబంధించిన కమిటీలను ప్రకటించే నిమిత్తం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంలోనే వంగవీటి రాధాకు పార్టీ కండువా కప్పే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

టీడీపీకి మ‌రో షాక్‌.. జ‌న‌సేన‌లోకి వంగ‌వీటి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share