ఒక్క రాంగ్‌స్టెప్‌తో అధః పాతాళంలోకి వంగ‌వీటి

July 5, 2019 at 11:24 am

తెలుగు రాజ‌కీయాల్లో దివంగ‌త కాపు నేత వంగ‌వీటి మోహ‌న‌రంగా పేరుకు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 1985 – 90 ద‌శ‌కంలో తెలుగు రాజ‌కీయాల్లో ఓ కీ రోల్‌గా మారిన మోహ‌న‌రంగా త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చారు వంగ‌వీటి రాథా. 26 సంవ‌త్స‌రాల‌కే ఎమ్మెల్యేగా గెలిచిన రాధా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనేకంటే ప్ర‌తి సారి రాంగ్ స్టెప్‌లు వేసి అతి త‌క్కువ వ‌య‌స్సులోనే రాజ‌కీయంగా ఉన్న‌త శిఖ‌రాల‌కు వెల్లాల్సిన వాడు రాజ‌కీయంగా ప‌త‌న దిశ‌గా చేరిపోయాడు. కాంగ్రెస్ పార్టీతో ప్రారంభం అయిన రాధా రాజ‌కీయ ప్ర‌స్థానం ఆ పార్టీలో ఉన్న‌త స్థితికి చేరుకుంది.

2009 ఎన్నిక‌ల్లో దివంగ‌త మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పార్టీ మార‌వ‌ద్ద‌ని… మంత్రి ప‌ద‌వి ఇస్తానని చెప్పినా విన‌కుండా రాధా ప్ర‌జారాజ్యంలోకి వెళ్లారు. ఆ ఎన్నిక‌ల్లో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన‌ ఆయ‌న ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంలో ఆ పార్టీలో యాక్టీవ్‌గా లేక‌పోయినా వైసీపీ గూటికి చేరారు. 2014 ఎన్నిక‌ల్లో విజ‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి గ‌ద్దె రామ్మోహ‌న్ చేతిలో ఓడిపోయారు. రాధా రాజ‌కీయాల్లో యాక్టీవ్‌గా లేక‌పోవ‌డంతో విసికెత్తిపోయిన జ‌గ‌న్ చివ‌ర‌కు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ సీటును మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు కేటాయించారు. చివ‌ర‌కు రాధాకు విజ‌య‌వాడ తూర్పు లేదా అవ‌నిగ‌డ్డ లేదా బంద‌రు పార్ల‌మెంట్ నుంచి పోటీ చేయాల‌ని ఖ‌ర్చంతా తాము భ‌రిస్తామ‌ని ఆఫ‌రు కూడా ఇచ్చారు.

రాధా మాత్రం తాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని ప‌ట్టు ప‌ట్టారు. చివ‌ర‌కు రాధా వైసీపీలో ఇమ‌డ‌లేక టీడీపీ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేశారు. త‌న తండ్రిని పొట్ట‌న పెట్టుకున్న టీడీపీ అని ఎన్నో సార్లు విమ‌ర్శ‌లు చేసిన రాధా చివ‌ర‌కు ఆ పార్టీలోకే వెళ్ల‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు. ఈ క్ర‌మంలోనే రాధా – రంగా మిత్ర మండ‌లిలో కూడా చీల‌క‌లు వ‌చ్చేసాయి. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిన రాధాకు చంద్ర‌బాబు మచిలీప‌ట్నం లేదా అన‌కాప‌ల్లి నుంచి ఎంపీకి పోటీ చేయాల‌ని ఆఫ‌ర్ ఇచ్చినా ఆయ‌న ఆస‌క్తి చూప‌లేదు. ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచాక ఎమ్మెల్సీ వ‌స్తుంద‌ని ఆశ‌తో రాధా ఉన్నారు.

ఇప్పుడు టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో రాధా జీవితం మ‌రో ఐదేళ్ల పాటు అగ‌మ్య‌గోచ‌రంగానే ఉంది. ఇప్ప‌టికే ప్ర‌జారాజ్యంలోకి వెళ్లి రాంగ్ స్టెప్ వేసిన రాధా వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీలోకి వెళ్లి మ‌రో రాంగ్ స్టెప్ వేశారు. టీడీపీ ఓడిపోవ‌డంతో రాధా తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రెండు సార్లు భేటీ అవ్వ‌డంతో ఆయ‌న జ‌న‌సేనలోకి వెళ్లిపోతున్నార‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. జ‌న‌సేన‌లో చేరే విష‌యంపై మాత్రం రాధా క్లారిటీ ఇవ్వ‌డం లేదు. రాధా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌న‌సేన‌లో చేరినా ఆయ‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని ఆశించం అత్య‌శే అవుతుంది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కే భ‌విష్య‌త్త్ రాజ‌కీయాల‌పై క్లారిటీ లేదు. అలాంటి విష‌యంలో రాధా మ‌రో రాంగ్ స్టెప్‌కు రెడీ అవుతున్నాడా అని రంగా – రాధా అభిమానులు ఆవేధ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైన వ‌రుస రాంగ్ స్టెప్‌ల‌తోనే రాధా రాజ‌కీయ భ‌విష్య‌త్తు నాశ‌నం చేసుకున్నాడ‌న్న మాట బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌ర‌చూ వినిపిస్తోంది.

ఒక్క రాంగ్‌స్టెప్‌తో అధః పాతాళంలోకి వంగ‌వీటి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share