విజ‌య‌న‌గ‌రంలో ఆ రెండు పార్టీల అంచ‌నాలు ఇవే!

May 6, 2019 at 9:17 am

ఉత్త‌రాంధ్ర‌లోని కీల‌క‌మైన జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం ఒక‌టి. ఇక్క‌డ నుంచి కీల‌క‌మైన రాజ‌కీయ నేత‌లు రాష్ట్ర పాలిటిక్స్‌లో చ‌క్రం తిప్పారు. ముఖ్యంగా అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, సుజ‌య్ కృష్ణ‌రంగారావు వంటి వారు ఈ జిల్లా నుంచే అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూమంత్రులుగా చ‌లామ‌ణి అయ్యారు. ఇక‌, గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ ఆరుస్థానాలు విజ‌యం సాధించ‌గా..కేవ‌లం మూడు చోట్ల మాత్ర‌మే వైసీపీ విజ‌యం సాధించింది. బొబ్బిలి, కురుపా, సాలూరు నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీ ద‌క్కించుకోగా, మిగిలిన చోట్లటీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇక‌, తాజాగా గ‌త నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ఇరు పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

మెజారిటీ స్థానాల్లో విజ‌యం సాధించేందుకు టీడీపీ,వైసీపీలు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాయి. ఈ ద‌ఫా వార‌సుల అరంగేట్రం కూడా ఇక్క‌డ చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తి రాజు కుమార్తె అతిది కూడా ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం విశేషం. తండ్రి ఎంపీగా ఆమె ఎమ్మెల్యేగా ఇక్క‌డ నుంచి పోటీ చేశారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచిన సుజ‌య్‌.. ఈ ద‌ఫా మాత్రం టీడీపీ టికెట్‌పై బొబ్బిలి నుంచే పోటీ చేశారు. వైసీపీ కూడా ఇక్క‌డ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. క‌నీసం 7 స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని జ‌గ‌న్ ల‌క్ష్యంగా పెట్టుకుని ఇక్క‌డ ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేశారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా ఇరు ప‌క్షాలు హోరెత్తించాయి. టీడీపీ గ‌త ప్రాభ‌వాన్ని నిల‌బెట్టుకోవ‌డంతోపాటు.. మ‌రిన్ని సీట్ల లో అంటే ఒక‌టో రెండో ఎక్కువ స్థానాల్లోనే విజ‌యం సాధించాల‌ని నిర్ణ‌యించుకుని ఆదిశ‌గా పోటీ చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప‌సుపు-కుంకుమ వంటివి ప్ర‌ధానంగా త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని భావిస్తున్న టీడీపీ ఇక్క‌డ కూడా ఇదే ఫార్ములా ప‌నిచేస్తుంద‌ని భావిస్తోంది. ఈక్ర‌మంలోనే జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. కీల‌క‌మైన నాయ‌కులు పోటీ లో ఉండ‌డంతో పోరు హోరా హోరీగానే సాగింది. దీంతో ఎవ‌రి అంచ‌నాలు వారు వేసుకున్నారు. అయితే, ఈ ద‌ఫా మార్పు కోరుకుంటున్నార‌నే ప్ర‌జానాడి నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఎవ‌రికి ఎన్ని సీట్లు ద‌క్కేలా చేస్తారో మాత్రం వేచి చూడాలి.

విజ‌య‌న‌గ‌రంలో ఆ రెండు పార్టీల అంచ‌నాలు ఇవే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share