విజ‌య‌సాయి ఫలించిన వ్యూహం .. వైసీపీలో చ‌ర్చ‌

April 22, 2019 at 10:45 am

ఏపీ విప‌క్ష పార్టీ వైసీపీని.. అధికారంలోకి తెచ్చేదిశ‌గా.. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వేసిన పాచిక‌లు విజ‌య‌వంతం అయ్యా యా? ప‌్ర‌త్య‌ర్థుల‌కు అడుగ‌డుగునా చుక్క‌లు చూపించ‌డంలో విజ‌య‌సాయి ఎత్తుగ‌డ‌లు స‌క్సెస్ అయ్యాయా? పార్టీలోకి కీల‌క‌మైన నేత‌ల‌ను ఆహ్వా నించ‌డంలోను, పార్టీనిబ‌లోపేతం చేయ‌డంలోను విజ‌య‌సాయి వ్యూహాలు ఫ‌లించాయా? అంటే.. తాజా ప‌రిణామాలు, ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిస్తితిని అంచ‌నా వేస్తున్న మేధావులు, పార్టీలోని కీల‌క నేత‌లు కూడా ఔన‌నే అంటున్నారు. వైసీపీలోకి విజ‌య‌సాయి రెడ్డి ఆగ‌నం ముందున్న ప‌రిస్థితులు, ఆయ‌న పార్టీలోకి వ‌చ్చి కీల‌క‌మైన బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఉన్న ప‌రిస్థితులు అనే రెండు విభాగాలుగా చూసుకున్నప్పుడు విజ‌య‌సాయి రెడ్డి పార్టీలోకి అరంగేట్రం చేసిన త‌ర్వాత ప‌రిస్థితులు భిన్నంగానే ఉన్నాయ‌ని అంటున్నారు.

వాస్త‌వానికి జ‌గ‌న్ సంస్థ‌ల‌కు ఆడిట‌ర్‌గా ఉన్న విజ‌య‌సాయి రెడ్డికి తొలుత రాజ‌కీయాల‌పై పెద్ద‌గా ఆస‌క్తి లేదు. కానీ, కాంగ్రెస్ మోపిన కేసుల నేప‌థ్యంలో జ‌గ‌న్ జైలుకు వెళ్లిన స‌మ‌యంలో పార్టీలో వ్యూహాలు ర‌చించేందుకు పెద్ద‌గా ఎద‌రూ ముందుకు రాలేదు. ఈ స‌మ‌యంలో ఆడిట‌ర్‌గా ఉన్న విజ‌య‌సాయి.. ప్ర‌త్యేక ఆహ్వానం మేర‌కు వైసీపీలోకి వ‌చ్చారు. ఆయ‌న వ‌చ్చీ రావ‌డంతోనే పార్టీలోని స‌మ‌స్య‌ల‌పై ముఖ్యంగా కార్య‌క‌ర్త‌ల క్ర‌మ‌శిక్ష‌ణ‌పై దృష్టి పెట్టారు. ప్ర‌తి జిల్లా, ప్ర‌తిమండల కేంద్రంలోనూ తిరుగుతూ.. కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ప్ర‌తి ఒక్క‌రినీ ఏక‌తాటిపై న‌డిపించేందుకు కృషి చేశారు. దీనిలో భాగంగానే కార్య‌క‌ర్త‌ల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను తొలిసారిగా వైసీపీలో ప‌రిచ‌యం చేశారు. అదేస‌మ‌యంలో విశాఖ‌జిల్లా స‌హా ప‌ట్ట‌ణ ప్రాంతాన్ని కీల‌కంగా తీసుకున్న విజ‌య‌సాయి.. అక్క‌డే మకాం వేసి ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో వైసీపీ ఎదిగేలా కీల‌క చ‌ర్యలు చేప‌ట్టారు.

ఎన్నిక‌ల విష‌యాన్ని తీసుకుంటే.. వైసీపీలో భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌శాంత్ కిశోర్‌ను అప్పాయింట్ చేసుకున్న‌ది సాయిరెడ్డి సూచ‌న‌ల మేర‌కే.ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించిన నాటి నుంచి అయ్యే వ‌ర‌కు పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ నిత్యం జ‌గ‌న్‌కు నాటి ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ.. ముందుకు సాగారు. పార్టీలో ఎవ‌రు చేరాల‌న్నా, లేదు పార్టీలోకి ఎవ‌రిని ఆహ్వానించాల‌న్నా కూడా విజ‌య‌సాయిరెడ్డి కీల‌క‌మైన కేంద్రంగా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్యంగా న‌వ‌ర‌త్నాల‌పై ప్ర‌చారం కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేయ‌డంలో కానీ, విజ‌యాసాయి పాత్ర‌ను విస్మ‌రించ‌లేం. అదేస‌మ‌యంలో కేంద్రంతోనూ సంబంధ బాంధ‌వ్యాల‌ను కొన‌సాగిస్తూ.. రాష్ట్రంలో వైసీపీ ప‌రిస్థితిని వివ‌రిస్తూ.. పార్టీ అధికారుల నుంచి ఎదుర‌వుతున్న ప్ర‌తిబంధ‌కాల‌ను వెల్ల‌డించి చ‌ర్య‌లు తీసుకునేలా చేసింది కూడా విజ‌య‌సాయి అన‌డంలో సందేహం లేదు. ఇలా ఎలా చూసుకున్నా.. వైసీపీలో కీల‌క రోల్ పోషించిన విజ‌య‌సాయి వైసీపీ గెలుపులోనూ కీల‌క పాత్రను పోషించార‌న‌డంలో సందేహం లేదు.

విజ‌య‌సాయి ఫలించిన వ్యూహం .. వైసీపీలో చ‌ర్చ‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share