అందుకే విజ‌య‌శాంతి శ‌శిక‌ళ‌తో భేటీ!

January 6, 2019 at 11:44 am

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నిచ్చెలి శ‌శిక‌ళ‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
అక్ర‌మంగా ఆస్తులు పొగేసుకున్నార‌ని నిర్ధార‌ణ కావ‌డంతో శ‌శిక‌ళ‌కు జైలు శిక్ష ప‌డింది. ప్ర‌స్తుతం శ‌శిక‌ళ బెంగ‌ళూరులోని ఓ జైల్లో శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత అన్నా డీఎంకేలో ఎన్నోమార్పులు జ‌రిగాయి. నాట‌కీయ ప‌రిణ‌మాలు. కేంద్రంలోని బీజేపీ చ‌క్రం తిప్ప‌డంతో శ‌శిక‌ళ‌కు ఆ పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యం ద‌క్క‌లేదు. దీంతో అన్నా డీఎంకే నుంచి విడిపోయి ‘అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీ’ని శశికళ స్థాపించారు. ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే జైలు ములాఖ‌త్‌లో వీరిద్ద‌రి భేటీపై ప్ర‌స్తుతం జాతీయ‌స్థాయిలో జోరుగా సాగుతోంది.vijayashanthi-shashikala_710x400xt

వారిద్దరు ఏ విషయంపై మాట్లాడుకున్నారనే దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు ఆ పార్టీ మద్దతు కోరేందుకే శశికళను రాములమ్మ కలిసినట్లు ప్రస్తుతం వార్తలొస్తున్నాయి. గతంలో కూడా జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు శశికళను విజ‌య‌శాంతి క‌లిసారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ శశికళ వద్దకు రాములమ్మను రాయ‌బారిగా పంపింద‌నే వాద‌న ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అక్రమాస్తుల కేసుపై పునర్విచారణ జరిపి శశికళను బయటకు తీసుకువస్తామని విజయశాంతి భరోసా ఇచ్చి ఉండొచ్చని కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి.

వాస్త‌వానికి తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే పార్టీ కాంగ్రెస్ వైపు ఉంది. కేంద్రంలో ఎవరికి మద్దతు ప్రకటించాలన్నదానిపై అన్నా డీఎంకేలో గందరగోళం నెలకొంది. అయితే – ఆ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో శశికళ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోంది. పొత్తుల ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్సే రాములమ్మను శశికళ వద్దకు పంపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ గురించి రాములమ్మ వద్ద శశికళ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

అందుకే విజ‌య‌శాంతి శ‌శిక‌ళ‌తో భేటీ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share