టీడీపీ పాల‌న `క‌మ్మ‌`గా…. బాబు రైట్‌హ్యాండ్ ఒప్పుకున్నట్టేనా..

July 16, 2019 at 5:21 pm

గ‌త టీడీపీ పాల‌నంతా `క‌మ్మ‌`మ‌య‌మ‌ని.. బాబుగారి పాల‌నంతా `క‌మ్మ‌`గా సాగింద‌ని ఆయ‌న రైట్‌హ్యాండ్‌, శాస‌న మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఒప్పుకున్న‌ట్టేనా..? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇటీవ‌ల వైసీపీని ఉద్దేశించి.. ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి సుమారు నెల‌న్న‌ర అవుతోంది. ఇంకా కార్పొరేష‌న్లు, నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ ఇంకా పూర్తే కాలేదు. కానీ.. ఇంత‌లో టీడీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు న‌వ్వుల‌పాల‌వుతున్నాయి.

నిజానికి.. తొంద‌ర‌ప‌డ‌డంలో.. ముందే కూయడంలో త‌మ‌నెవ‌రూ బీట్ చేయ‌లేర‌ని టీడీపీ నేత‌లు మ‌రోసారి నిరూపించుకుంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ నియామకాలను రెడ్డి సామాజికవర్గంతో నింపుతున్నారని శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బడ్జెట్ చర్చ సంద‌ర్భంగా ఆయన ఈ వ్యాఖ్య‌లు చేశారు. కార్పొరేషన్ లు , కమిటీలలో రెడ్డి సామాజికవర్గం వారు అధికంగా కనిపిస్తున్నారని య‌న‌మ‌ల‌ ఆరోపించారు. గతంలో తమ ప్రభుత్వాన్ని విమర్శించి.. ఇప్పుడు వారు కూడా అదేపని చేస్తున్నారని ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఇక ఇక్క‌డే దొరికిపోయారు య‌న‌మ‌ల‌. అంటే.. గ‌త టీడీపీ పాల‌నంతా క‌మ్మ‌ల‌మ‌య‌మని య‌న‌మ‌ల ఒప్పుకున్న‌ట్టేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఎందుకంటే చంద్ర‌బాబు పాల‌న‌లో ఎక్క‌డ చూసినా ఆ వ‌ర్గం వాళ్ల‌కే బాగా మేళ్లు జ‌రిగాయి. నిజానికి.. టీడీపీ ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఇచ్చిన ప్రాధాన్యం, క‌ల్పించిన స‌ముచిత స్థానం ఏమీ లేదు. మంత్రివ‌ర్గంలో చంద్ర‌బాబు కేవ‌లం ఇద్ద‌రు ఎస్సీల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఇచ్చారు. కానీ.. ప్ర‌స్తుతం వైసీపీ అధినేత , ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. త‌న మంత్రివ‌ర్గంలో ఐదుగురు ఎస్సీల‌కు చోటు క‌ల్పించారు.

ఏకంగా హోశాంఖ ప‌ద‌విని కూడా క‌ట్ట‌బెట్టారు. అలాగే.. ఐదుగురు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల‌కు వివిధ సామాజిక‌వ‌ర్గాల‌కు ఇచ్చారు. అంటే సుమారు 60శాతం ప‌ద‌వులు బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌కు కేటాయించి, చరిత్ర సృష్టించారు. ఇలా పోల్చిచూస్తూ ఇప్పుడు య‌న‌మ‌ల వ్యాఖ్య‌లను సామాన్య‌జ‌నం కూడా త‌ప్పుప‌డుతున్నారు.

టీడీపీ పాల‌న `క‌మ్మ‌`గా…. బాబు రైట్‌హ్యాండ్ ఒప్పుకున్నట్టేనా..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share