జ‌గ‌న్ ఇరుక్కుంటాడా..వారినే ఇరికిస్తాడా?

June 27, 2019 at 11:05 am

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య‌మైన చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. జ‌గ‌న్ వేస్తున్న అడుగులు, ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యా లకు ఏపీ ప్ర‌జ‌లు ఫిదా అవుతున్నారు. ఈ విష‌యంలో సందేహం లేదు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కూడా ద‌న్నుగా నిలుస్తుంది. ఈ విష‌యంలోనూ అనుమానం అవ‌స‌రం లేదు. అయితే, ఒకే ఒక్క విష‌యంలో మాత్రం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని లేకుంటే బీజేపీ చేతిలో చిక్కి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎదుర్కొంటున్న ప‌రిస్థితినే తెచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ విభ‌జ‌న‌చ‌ట్ట‌లో చేర్చ‌క పోయినా.. ప్ర‌త్యేక హోదా అంశం మాత్రం ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చేరిపోయింది.

నిజానికి ఏ ఇద్ద‌రు క‌లిసి మాట్లాడుకున్నా.. విభ‌జ‌న చ‌ట్టం అంటూ ఒక‌టి ఉంద‌ని కూడా తెలియ‌ని వారు సైతం.. హోదా గురించి మాట్లాడుతున్నారు. అంత‌గా రాజ‌కీయ నేత‌లు, ముఖ్యంగా వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల్లోకి దీనిని తీసుకు వెళ్లారు. అప్ప‌ట్లో అంటే విప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి ఓకే! ఈ కార‌ణంగానే ప్ర‌జ‌లు ఎక్క‌డ వైసీపీకి ఓట్లేస్తారో.. ఎక్క‌డ అధికారం పోతుందోన‌ని భ‌య‌ప‌డిన అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు హోదా విష‌యంలో యూట‌ర్న్ తీసుకున్నారు. ముందు కేంద్రంలోని బీజేపీ చెప్పిన‌ట్టు హోదాతో ఏం వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఆ త‌ర్వాత అనూహ్యంగా హోదా కోసం ప‌ట్టుబ‌ట్టారు. ఐదు కోట్ల ప్ర‌జ‌ల కోరిక‌ను నెర‌వేర్చాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు.

ఈ క్ర‌మంలో అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానాన్ని సైతం బాబు బుట్ట‌దాఖ‌లు చేశారు. అయితే, ఇదే విష‌యాన్ని ప‌ట్టుకుని ముందుకు వెళ్లిన వైసీపీ.. మేనిఫెస్టోలో పెట్టక‌పోయినా..ప్ర‌జ‌ల‌కు మాత్రం ద‌గ్గ‌రైంది. 22 మంది ఎంపీల‌ను సంపాయించు కుంది. దీంతో ఇప్పుడు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు అన్నీ కూడా హోదాపైనే ఉన్నాయి. ఇక‌, అప్ప‌ట్లో వైసీపీ ఎలా అయితే, హోదా కోసం యాగీ చేసిందో ఇప్పుడు టీడీపీ కూడా వైసీపీపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధ‌మైంది. మ‌రోప‌క్క‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా హోదా విష‌యంపై ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ క్ర‌మంలో స‌హ‌జంగానే జ‌గ‌న్‌పై హోదా ఒత్తిడి పెరిగిపోతుంది. మ‌రోప‌క్క‌, కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం చెప్పిన మాట‌నే చెబుతోంది.

మ‌రో మాట‌లో చెప్పాలంటే.. మొండివాద‌న‌నే వినిపిస్తోంది. హోదా ఇచ్చేది లేద‌ని, అస‌లు దానిపై తాము దృష్టి కూడా పెట్ట‌లేద‌ని తాజాగా కేంద్ర‌మంత్రి నిర్మ‌ల వెల్ల‌డించారు. దీంతో ఈ ప‌రిస్థితి ఇప్పుడు జ‌గ‌న్‌కు వద‌ల మంటే.. ప్ర‌జ‌ల‌కు కోపం, ఇవ్వ‌మంటే కేంద్రానికి కోపం అన్న ప‌రిస్తితిని తెచ్చుకుంటున్నారు. ఇటు ప్ర‌జ‌ల‌ను కాదంటే.. అధికారానికి ఎస‌రు రావ‌డం ఖాయం. అలాగ‌ని కేంద్రంపై ఒత్తిడి పెంచితే.. గ‌త ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు ఎదుర్కొన్న విధంగా నిర్బంధాలు, ఈస‌డింపులు, నిధుల‌కు బ్రేక్ వంటివి ఎదుర్కొన‌డంతోపాటు జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌ను కూడా తిర‌గ‌దోడే ప‌రిస్తితి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తారో అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది. మ‌రి ఏం చేస్తాడో చూడాలి.

జ‌గ‌న్ ఇరుక్కుంటాడా..వారినే ఇరికిస్తాడా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share