జ‌గ‌న్ టార్గెట్‌తో బాబు క‌థ ఖ‌తం!

April 23, 2019 at 3:55 pm

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఎప్పుడు ఎవ‌రు ఎలా మారు తారో..ఎప్పుడు ఎవ‌రు ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటారో? కూడా చెప్ప‌డం క‌ష్టం. ఈ నేప‌థ్యంలోనే రాజ‌కీయాలు, నాయ‌కుల వ్యూహాల‌ను వెల్ల‌డించ‌డం, అంచ‌నా వేయ‌డం అంత ఈజీకాద‌ని అంటారు. ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయ‌మ‌ని అంటున్నారు.దీనికి అనుగుణంగానే ప్ర‌జ‌లు తీర్పు చె ప్పార‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఒక వేళ జ‌గ‌న్ క‌నుక అధికారంలోకి వ‌స్తే.. చంద్ర‌బాబు ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న ఏ విధంగా ముందుకు వెళ్తారు? అనే ప్ర‌శ్న‌లు ఉద‌యి స్తున్నాయి.

నిజానికి పాద‌యాత్ర నిర్వ‌హించిన స‌మ‌యంలోను, త‌ర్వాత కూడా జ‌గ‌న్ త‌న ల‌క్ష్యాన్ని స్ప‌ష్టంగా చెప్పారు. తాను క‌నీసం రాబోయే 30 ఏళ్ల‌పాటు సీఎంగా ఉండాల‌ని భావిస్తున్నాన‌ని అన్నారు. దీనిని మొద‌ట్లో చాలా తేలిక‌గా తీసుకున్న టీడీపీ అండ్ కోలు త‌ర్వాత త‌ర్వాత మాత్రం చాలా సీరియ‌స్‌గానే దీనిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇప్పుడు అధికార మార్పు త థ్య‌మ‌ని చెబుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. ఈ ఐదేళ్లే కాకుండా ప‌టిష్టంగా మ‌రో 25 ఏళ్ల‌పాటు త‌న అ ధికారాన్ని ప‌దిలం చేసుకునేందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తాడ‌ని అంటున్నారు. జ‌గ‌న్ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి ఎ న్నిక‌ల‌కు ముందు ప్ర‌యోగాలు చేసిన చంద్ర‌బాబుకే అధికారం నిల‌బెట్టుకోవ‌డంపై ధీమా ఉంది.

మ‌రి అలాంట‌ప్పుడు జ‌గ‌న్ త‌న‌కు ద‌క్కిన అధికారాన్ని అంత తేలిక‌గా వ‌దులుకుంటార‌నే ఆలోచ‌న చేయ‌డం జ‌గ‌న్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేసిన‌ట్టే అవుతుంది. అంటే.. త‌న‌కు అందిన అధికారంతో మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారాన్ని నిల‌బెట్టుకునేం దుకు ఉన్న అన్ని మార్గాల‌ను వినియోగించుకుంటార‌నే అంటున్నారు మేధావులు. ఇలా ఎలా చూసినా.. ఇప్పుడు క‌నుక జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. చంద్ర‌బాబు ఇక‌, త‌న జీవితంలోనే సీఎం కుర్చీపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, ఆయ‌న కుమారుడు, నారా లోకేష్ రాజ‌కీయ ప‌రిస్థితి కూడా అగమ్య గోచ‌రంగా మార‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్ టార్గెట్‌తో బాబు క‌థ ఖ‌తం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share