బాబు త‌ప్పులు.. జ‌గ‌న్‌కు తిప్పలు

June 4, 2019 at 10:10 am

లేస్తే.. నా అంత మొగాడు లేడ‌న్న‌ట్టుగా ప్ర‌చారం చేసుకోవడం, న‌న్ను మించిన రాజ‌కీయ నేత లేడ‌ని చెప్పుకోవ‌డం, అ నుంగుల‌తో భాజా భ‌జంత్రీలు కొట్టించుకోవ‌డంతోనే చంద్ర‌బాబు పాల‌న అంత‌రించిపోయింది. అభివృద్ధికి కేరాఫ్‌గా ఏపీ ని నిలుపుతాన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. అప్పులకు కేరాఫ్‌గా ఈ రాష్ట్రాన్ని మిగిల్చార‌నేది వాస్త‌వం. రాష్ట్రం ఏర్ప‌డ్డాక 16 వేల కోట్ల లోటు బ‌డ్జెట్‌ను ప్ర‌స్తుతం 2.66 ల‌క్ష‌ల కోట్ల‌కు చేర్చిన ఘ‌న‌త అక్ష‌రాలా చంద్ర‌బాబుదేన‌న‌డంలో సందేహం లేదు. గ‌డిచిన ఐదేళ్ల‌లో త‌న అనుభ‌వంతో రాష్ట్రాన్ని పాలిస్తాడ‌ని ప్ర‌జ‌లు ఎంత‌గానో చంద్ర‌బాబుపై ఆశ‌లు పెట్టుకున్నా రు. కానీ, ఆయ‌న ప్ర‌చారం, మాట‌ల మంత్రాలే త‌ప్ప పెద్ద‌గా చేసింది ఏమీలేద‌నేది స్ప‌ష్టం అయింది.

కీల‌కమైన ప్రాజెక్టుల నుంచి సాధార‌ణ ప‌రిపాల‌న వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు చేసిన త‌ప్పులు ఇప్పుడు అధికారం చేప‌ట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. చంద్ర‌బాబు చేసిన త‌ప్పులను రెండు ర‌కాలుగా చూడాల్సి ఉంటుంది. ఒక‌టి ఆర్థికంగా ఆయ‌న చేసిన చేటు. రెండు పాల‌నా ప‌రంగా ఆయ‌న ఉదాశీన‌త‌. ఈ రెండూ కూడా ఇప్పుడు రాష్ట్రాన్ని అతఃపాతాళానికి నెట్టేస్తున్నాయి. ఆర్థికంగా రాష్ట్రంలో లోటు బ‌డ్జెట్‌లో ఉంద‌ని తెలిసి కూడా చేతికి ఎముక‌లేని దాత అనిపించుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌జాధ‌నాన్ని ఉదారంగా మంచి నీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేసేశారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల పేరుతో ఆయ‌న విలాసాలు సాగించార‌న‌డంలో సందేహం లేదు.

నిత్యం హెలికాప్ట‌ర్లలోనే ప‌ర్య‌టించారు. ఇక‌, గ‌డిచిన నాలుగేళ్ల ప‌దినెల‌ల కాలంలో చంద్ర‌బాబు చేసిన దుబారా అంతా ఇంతా కాద‌ని అధికారులే చెప్పుకొంటున్నారు. ధ‌ర్మ పోరాట దీక్ష‌లు, పుష్క‌రాల పండుగ‌లు, తోఫాలు, కానుక‌లు, కార్పొరేష‌న్లు, ఇలా ఆయ‌న నోటికి ఏది వ‌స్తే.. దానిని ప్ర‌క‌టించి చేతికి ఎంత వ‌స్తే.. అంత దానం చేసేయ‌డం వంటివి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగ‌దీశాయి. ఇక‌, కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల‌ను కూడా నిర్ణీత ప‌థ‌కానికి కాకుండా ఇష్టానుసారంగా ఖ‌ర్చు చేశారు. దీంతో కేంద్రం దుకాణాన్ని బంద్ చేసి లెక్క‌లు కోరింది. లెక్క‌లు చూపించ‌లేని బాబు నిర్ణీత ప‌రిమితికి మించి అప్పులు తెచ్చి మ‌రీ త‌న అనుంగుల‌ను సాకారు.

దీంతో ఏపీ ఖ‌జానా కొల్ల‌బోయింది. ఏడాదికి 20 వేల కోట్ల అప్పులు, ఏడాదికి 10 వేల కోట్ల వ‌డ్డీల భారం పెరిగింది. దీంతో ఇప్పుడు దీనిని గాడిలో పెట్టేందుకు, ఏపీని అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌కు తెచ్చేందుకు జ‌గ‌న్ త‌ల‌కింద‌లు ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, రెండో విష‌యానికి వ‌స్తే.. పాల‌నా ప‌రంగా చంద్ర‌బాబు సీనియ‌ర్ అనుకున్నారు అంద‌రూ. అయితే, ఆయ‌న పాల‌నా ప‌రంగా అవినీతిని ప్రోత్స‌హించ‌క‌పోయినా.. చూస్తూ.. చొంగ‌కార్చుకున్నారు. ఫ‌లితంగా రాష్ట్రంలో ఏ ప‌నికావాల‌న్నా.. చేతులు త‌డ‌పాల్సిన దుస్తితి. అదేస‌మ‌యంలో విద్య‌, వైద్య రంగాల్లో ప్రైవేటుకు చంద్ర‌బాబు త‌లుపులు బార్లా తెరిచారు. ప‌లితంగా పేద‌ల‌కు వైద్యం, విద్య అందుబాటులోకి రాకుండా పోయాయి.

ఇక‌, ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో అవినీతి నిలువుదోపిడీగా మారిపోయింది. రెవెన్యూ ఆఫీస్‌లు, ముఖ్యంగా త‌హ‌సీల్దార్‌, రిజిస్ట్రార్ కార్యాల‌యాలు వ‌సూళ్ల కేంద్రాలుగా మారాయి. ఇసుక మాఫియా, భూక‌బ్జా రాయుళ్లు పెరిగిపోయారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. దీనిని ఇప్పుడు గాడిన పెట్టేందుకు జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా కృషి చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. వీట‌న్నింటికీ మించి మ‌ద్యం షాపుల‌కు విరివిగా లైసెన్సులు ఇచ్చారు చంద్ర‌బాబు. అదేస‌మ‌యంలో బెల్ట్‌ను ప్రోత్స‌హించారు. వీటిని ఏరేయ‌డం అంత సులువు కాద‌న్న‌ట్టుగా విచ్చ‌ల‌విడి దోపిడీకి తెర‌దీశారు. ఇలా ఫార్టీ ఇయ‌ర్స్ అనుభవం రాష్ట్రాన్ని నాశ‌నం చేసి పెడితే.. ఫార్టీ ఇయ‌ర్స్ సీఎం వీటి దుమ్ముదులిపేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆప‌శోపాలు ప‌డుతున్నారు.

బాబు త‌ప్పులు.. జ‌గ‌న్‌కు తిప్పలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share