జ‌గ‌న్ ఎఫెక్ట్‌.. బాబుకు తిప్ప‌లేనా…?

June 9, 2019 at 1:28 pm

సాధార‌ణంగా ఏ రాష్ట్రంలో అయినా అధికారం అనేది ఒక‌సారి వ‌స్తుంది.. మ‌రోసారి పోతుంది. ప్ర‌జ‌లు త‌మ‌కు ఏ పార్టీ ఇష్ట మ‌ని భావిస్తే.. ఆ పార్టీకి మ‌ద్ద‌తిస్తారు. ఆ పార్టీని గెలిపిస్తారు. అయితే, ఏ పార్టీకికూడా అధ‌కారం శాశ్వ‌తం కాదు అనే అంటా రు రాజ‌కీయ నాయ‌కులు. కానీ, బ‌ల‌మైన నాయ‌కుడు ఉన్న‌ప్పుడు, త‌మ‌కు స్వ‌చ్ఛ‌మైన పాల‌న అందుతున్న‌ప్పుడు ప్ర‌జ లు ఆ నాయ‌కుల‌ను వ‌దిలిపెట్టర‌ని, ఆ పార్టీల‌కు ప‌ట్టంక‌ట్ట‌కుండా ఉండ‌లేర‌ని ఒడిసా, ప‌శ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు నిరూపించాయి. ఒడిసాలో గ‌డిచిన 20 ఏళ్లుగా న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం కొన‌సాగుతోంది ఇప్పుడు మ‌రో ఐదేళ్ల‌పాటు ఆయ‌న ప‌గ్గాలు చేప‌ట్టారు.

ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి వ‌స్తుందా? ఇక్క‌డ తాజాగా ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌ట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఖ‌చ్చి తంగా తాను నిర్దేశించుకున్న 30 ఏళ్ల‌పాటు అధికారంలోనే ఉంటారా? అనే వ్యాఖ్య‌ల‌కు ఆ పార్టీ వ‌ర్గాల నుంచి ఔన‌నే వ్యా ఖ్యలే వినిపిస్తున్నాయి. సీఎంగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసి ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా కాకుండానే పాల‌న‌పై త‌న దైన ముద్ర వేశారు. అవినీతి ర‌హిత రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఆదిశ‌గా అడుగులు వేస్తున్నారు. ప్రా జెక్టుల కాంట్రాక్టుల‌ను ఆయ‌న పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించేందుకు జ్యూడీషియ‌ల్ క‌మిటీకి అప్ప‌గిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇక‌, తాజాగా కేబినెట్ విష‌యానికి వ‌స్తే. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ వ‌ర్గాల‌కు పెద్ద‌పీట వేశారు. దీంతో ఆయా వ‌ర్గాల్లో ఇప్పుడు జ‌గ‌న్ ప‌ట్ల సానుభూతి భారీ ఎత్తున పెరిగింది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు బీసీ వ‌ర్గాలు టీడీపీతోనే ఉన్నాయి. తాజా గా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వా సాగిన‌ప్ప‌టికీ.. బీసీ వ‌ర్గాలు మాత్రం త‌మ ఓటును చంద్ర‌బాబుకే వేయ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ ఈ వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనేలా రాజ‌కీయంగా తొలి అడుగు వేశారు. కేవ‌లం బీసీ వ‌ర్గానికి ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు, మంత్రుల్లో 50 శాతానికిపైగా బడుగు బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారు.

ఈ ప‌రిణామంతో జ‌గ‌న్ త‌న బీసీ డిక్ల‌రేష‌న్‌ను అప్ర‌క‌టితంగా అమ‌ల్లోకితెచ్చార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ వెంటే బీసీలు ఉన్నార‌ని, తాము త‌ప్ప బీసీల‌కు న్యాయం చేసింది ఎవ‌రూ లేర‌ని చెప్పుకొంటూ వ‌చ్చిన చంద్ర‌బాబు.. ఇప్పుడు ఈ వ‌ర్గానికి జ‌గ‌న్ ఇచ్చిన ప్రాధాన్యం తెలిసిన త‌ర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా.. జ‌గ‌న్ త‌న పాల‌న‌లో ఇదే దూకుడు చూపిస్తే.. చంద్ర‌బాబు బీసీ వ‌ర్గాన్ని కాపాడుకోవ‌డం, మ‌రో ఐదేళ్ల త‌ర్వాత వీరితో ఓట్లు వేయించుకోవ‌డం అనేవి క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్ ఎఫెక్ట్‌.. బాబుకు తిప్ప‌లేనా…?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share