అక్కడే కేసీఆర్‌, జ‌గ‌న్ భేటీ..?

April 25, 2019 at 11:30 am

ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముఖాముఖి భేటీకి రంగం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఈనెల 27 వ తేదీ త‌ర్వాత ఇద్ద‌రు క‌లుసుకోవ‌డానికి ప్ర‌ణాళికలు సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్న జ‌గ‌న్ రాష్ర్టానికి రాగానే క‌లుసుకోవ‌డానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సారి హైద‌రాబాద్‌లో కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్‌తో క‌లువ‌డానికి సీఎం క‌లుస్తార‌ని అంటున్నారు. విశాఖ‌ప‌ట్ట‌ణంలో గానీ, లేదంటే గుంటూరు జిల్లాలోని తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ కొత్త ఇంట్లో గానీ క‌లుసుకునే అవ‌కాశాలున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా డిమాండ్‌పై తెలంగాణ స‌ర్కార్ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని, అలాగే పోల‌వ‌రం ప్రాజెక్ట్ అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టంగా పేర్కొన‌డంతో ఏపీ జ‌నాలు కేసీఆర్ పై సానుకూల‌త వ్య‌క్తం చేస్తున్నార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.
ఫ్రెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో దేశ‌వ్యాప్తంగా మూడో కూట‌మికి కోసం కేసీఆర్ ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా ఇప్పుడు జ‌గ‌న్‌తో భేటీతో ప్రాధాన్యం సంత‌రించుకుంది. తెలంగాణ‌, ఏపీల్లో క‌లిపి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్కు 40 స్థానాలు వ‌స్తాయ‌ని టీఆర్ ఎస్ నేత‌లు ధీమాగా ఉన్నారు.

జ‌గ‌న్‌తో భేటీ త‌ర్వాత కేసీఆర్ త్రుణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం మాయావ‌తి, అఖిలేష్‌యాద‌వ్‌ల‌తో క‌లువ‌నున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఇప్ప‌టికే 17 రాష్ర్టాలు, ఐదు కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ఎన్నిక‌లు ముగియ‌డంతో కేసీఆర్ మూడో కూట‌మి దిశ‌గా ప్ర‌య‌త్నాలు ఎక్కువ చేస్తున్నారు. ఎన్నిక‌లు పూర్త‌గా అయ్యే వ‌ర‌కు ఫ్రంట్‌కు విస్ర్తుత ప్ర‌చారం క‌ల్పించి, జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డానికి సీఎం యోచిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల‌తో క‌లుపుకునిపోయే ప‌నిలో పూర్తిగా నిమ‌గ్న‌మ‌య్యారు.

అక్కడే కేసీఆర్‌, జ‌గ‌న్ భేటీ..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share