జ‌గ‌న్ పాద‌యాత్ర నిజాలు .. ఇప్ప‌టికైనా ఒప్పుకోవాల్సిందే!

June 11, 2018 at 10:18 am

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌పై అధికార టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు ఏవేవో కామెంట్లు చేస్తూనే ఉన్నారు. జ‌గ‌న్‌కు జ‌నాలు రావ‌డం లేద‌ని, ఆయ‌న పాద‌యాత్ర.. మార్నింగ్ వాక్ మాదిరిగా ఉంద‌ని అంటూ వ‌చ్చారు. నిజానికి జ‌గ‌న్ గ‌త ఏడాది నవంబ‌రు 6న ప్రారంభించిన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్రకు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న వ‌ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ క‌ష్ట‌మే..!స్తోంది. ఆనాడు ప్రారంభించిన స‌మ‌యంలో ఎలాంటి స్పంద‌న వ‌చ్చిందో ఇప్పుడు 185 రోజులు ముగిసిన త‌ర్వాత కూడా అదేత‌ర‌హాలో స్పంద‌న క‌నిపిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు క్యూ క‌డుతున్నారు. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు. ముఖ్యంగావృద్ధులు, మ‌హిళ‌లు, విద్యార్థులు, విక‌లాంగులు సైతం ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌లకు ఓర్చుకుని జ‌గ‌న్‌ను చూసేందుకు వ‌స్తున్నారు. 

 

నిజానికి చంద్ర‌బాబు సొంత జిల్లాచిత్తూరులో టీడీపీ హ‌వా ఉంటుంద‌ని, వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్వ‌హించే పాద‌యాత్ర‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌డం క‌ష్ట‌మ‌ని ప‌రిశీల‌కులు భావించారు. కానీ, అనూహ్యంగా బాబు సొంత జిల్లా, సొంత నియోజ‌క‌వ‌ర్గం లోనూ ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లిరావ‌డం విస్మ‌యం క‌లిగించింది. ఇవ‌న్నీ మీడియాలో చూస్తున్న‌ప్ప‌టికీ.. టీడీపీ నాయ‌కులు మాత్రం జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను త‌క్కువ చేసి చూపించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు ఎప్ప‌టిక‌ప్పుడు చేస్తేనే ఉన్నారు. ఆయా విష‌యాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంటున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల విష‌యంలో ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న‌ను చూసేందుకు వ‌స్తున్నారిని గౌర‌వంగా ప‌ల‌క‌రిస్తూ.. వారు చెబుతున్న స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా వింటూ ప‌రిష్కారానికి హామీ ఇస్తున్నారు. 

 

ఇక‌, ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోని పోలీసులే.. జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు వ‌స్తున్న జ‌నాల విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డిస్తున్నారు. అదేంటి? అనుకుంటున్నారు. ఇది నిజ‌మే. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో సాగుతున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌.. తూర్పుగోదావ‌రిలోకి ప్ర‌వేశించ‌నుంది. ఇక్క‌డ ఆయ‌న ప‌శ్చిమం నుంచి తూర్పులోకి వెళ్లేందుకు గోదావ‌రిపై వంతెన దాటాల్సి ఉంది. ఈ వంతెనను దాటుకుంటూ న‌డిచి.. తూర్పులోకి జ‌గ‌న్ ప్ర‌వేశించాల్సి ఉంది. అయితే, తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా పోలీసులు.. మాత్రం.. జ‌గ‌న్‌ను ఈపైవంతెన ఎక్కవ‌ద్ద‌ని రిక్వ‌స్ట్ చేశారు. అయితే, ఇదేదో అధికార అహంకారంతోనే, అడ్డంకులు సృష్టించాల‌నో కాదు.

 

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు త‌ర‌లివ‌స్తున్న అశేష ప్ర‌జావాహినిని గుర్తించి పోలీసులు ఈ హెచ్చ‌రిక‌లు చేశారు. వేల సంఖ్య‌లో జ‌గ‌న్‌తో స‌హా పాద‌యాత్ర‌లో పాల్గొంటున్న ప్ర‌జలు గోదావ‌రి బ్రిడ్జి ఎక్కితే.. అది కూలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని పోలీసులు హెచ్చ‌రించారు. సాంకేతికంగా ఈ విష‌యాన్ని కొంచెం ప‌క్క‌న పెడితే.. జ‌గ‌న్‌కు ఫాలో అవుతున్న ప్ర‌జ‌ల‌ను తీసుకుంటే.. ఇప్ప‌టికైనా టీడీపీ త‌న అహాన్ని వీడాల‌ని అనిపిస్తోంది. జ‌గ‌న్‌కు వ‌స్తున్న విశేష ప్ర‌జాద‌ర‌ణ‌ను ఒప్పుకొని తీరాల్సిందేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

జ‌గ‌న్ పాద‌యాత్ర నిజాలు .. ఇప్ప‌టికైనా ఒప్పుకోవాల్సిందే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share