జగన్ కు పవన్ కు మధ్య తేడా…అదే!

January 16, 2019 at 10:02 am

అవును! ఏ రంగ‌మైనా ప్ర‌త్య‌ర్థుల‌తో పోల్చుకుంటే.. ఎవ‌రికి వారు ఒక మెట్టు ఎక్కువ‌లో ఉండాల‌ని కోరుకుంటారు. అలాగే అంచ‌నా వేసుకుంటారు. రాజ‌కీయాల్లో కూడా ప్ర‌జ‌ల‌ను మెప్పించేందుకు, ప్ర‌జ‌ల్లో త‌మ గురించి చ‌ర్చించుకునేలా చేసు కునేందుకు నాయ‌కులు, పార్టీలు కూడా ఒక‌రిని మించి… అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం తెలుగు రాజ‌కీయాల్లో ఎక్క‌డై నా ఉంటుంది. అదే త‌మిళ‌నాడు రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి. అక్క‌డ ఒక‌రిని మించి మ‌రొక‌రు..ప్ర‌జ‌ల‌కు ఎన్ని ఉచిత హామీలు ప్ర‌క‌టించార‌నేది క్రిటేరియాగా ప్ర‌జ‌లు , నాయ‌కులు కూడా ఆలోచిస్తారు. మ‌న‌వైపు మాత్రం ప్ర‌జ‌లకు ఏం చేస్తా రు? ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో ఎంత మేర‌కు ఉన్నారు? అనే విష‌యాలు కీల‌కం.

ఏపీ రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే… ప్ర‌భుత్వ పార్టీ టీడీపీని ప‌క్క‌న పెడితే.. అధికారం కోసం పోటీ ప‌డుతున్న మ‌రో రెండు పార్టీలు జ‌న‌సేన‌, వైసీపీల విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు.. ఎవ‌రు ఎక్కువ మార్కులు వేయించుకుంటున్నారు? ఎవ‌రు ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు? ఎవ‌రు ఎన్ని విధాల ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు? అనే అంశాలు తెర మీదికి వ‌స్తున్నాయి. నిజ‌మే అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న పార్టీలు, ఆయా పార్టీ నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వాల‌నే విష‌యం ఎవ‌రూ తోసిపుచ్చ‌రు. జ‌న‌సేన‌, వైసీపీ నేత‌ల‌గ్రాఫ్ తీసుకుంటే.. జ‌గ‌న్ గ్రాఫ్ జోరుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని పార్టీగా జ‌న‌సేన ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ ఏం చేశాడు? అనే ప్ర‌శ్న ఉద్భ‌విస్తున్నది.

గ‌త ఎన్నిక‌ల్లో కేంద్రంలో న‌రేంద్ర మోడీని,రాష్ట్రంలో చంద్ర‌బాబును స‌మ‌ర్ధించిన ప‌వ‌న్‌.. అనేక ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేయించే పూచీ నాద‌ని ఆనాడు చెప్పారు. అంతేకాదు, రాష్ట్ర అభివృద్ధికి చంద్ర‌బాబు ఐకాన్ అని చెప్పారు. అయితే, ఇదే ప‌వ‌న్ రెండు సంవ‌త్స‌రాలు గ‌డిచేసరికి.. ప్ర‌త్యేక హోదా విష‌యంలోకానీ, పోలవ‌రం ప్రాజెక్టు విష‌యం లో కానీ, కేంద్రాన్ని నిల‌దీసింది ఏమీలేదు. పైగా ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ అని హ‌డావుడి చేసినా కూడా సాధించింది ఏమీ క‌నిపించ‌దు. ఇక‌, పోరు యాత్ర పేరుతో రెండు జిల్లాలు తిరిగినా.. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకున్నా తాను అధికారంలోకి వ‌స్తేచే ప‌ట్టే ప‌రిష్కార మార్గాలు కూడా ప‌వ‌న్ చూపించ‌లేదు. అదేవిధంగా తాను ఎన్నిక‌ల హామీలుగా ప్ర‌క‌టించిన వాటి హేతు బ‌ద్ధ‌త ఏమిటో కూడా ప‌వ‌న్ చెప్ప‌లేక పోయారు. ఇలా మొత్తంగా జ‌గ‌న్‌తో పోల్చుకుంటే ప‌వ‌న్ చాలా వెనుక‌బ‌డ్డార‌నే పేరు తెచ్చుకున్నారు.

జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న చేసిన సుదీర్ఘ పాద‌యాత్ర నిజానికి ప్ర‌పంచ రికార్డుతో స‌మానం. ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా ప్ర‌జ‌ల‌ను క‌లిశాడు. ఎన్న‌డూ లేని విదంగా అధికార ప‌క్షం నుంచితీవ్ర‌మైన ఇబ్బందులు వ‌చ్చిన‌ప్ప‌డు కూడా పాదయాత్ర‌ను కొన‌సాగించాడు. ఇక‌, విశాఖలో త‌న‌పై జ‌రిగిన దాడి విష‌యంలోనూ వ్యూహాత్మ‌కంగా నే వ్య‌వ‌హ‌రించాడు. అదేస‌మయంలో నేటికీ ప్ర‌త్యేక హోదా స‌జీవంగా ఉండ‌డానికి కార‌ణం జ‌గ‌న్‌. త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించి.. కేంద్రానికి గ‌ట్టి షాక్ ఇచ్చాడు. కేంద్రంపై పోరాడ‌దాం! అనే కాన్సెప్ట్‌ను తెర‌మీదికి తెచ్చిన నాయ‌కుడుగా కూడా జ‌గ‌న్‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇలా ఎలా చూసినా.. జ‌గ‌న్‌కు అనేక ప్ల‌స్‌లు క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

జగన్ కు పవన్ కు మధ్య తేడా…అదే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share