జ‌గ‌న్ యాత్ర‌కు సొంత సైన్యం!

November 9, 2018 at 4:58 pm

వైసీపీ అధినేత‌, విప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు అనూహ్య‌మైన ప‌రిస్థితిలో ఒక బ్రేక్ వ చ్చింది. విశాఖ విమానాశ్ర‌యంలో ఆయ‌న‌పై జ‌రిగిన క‌త్తి హ‌త్యాయ‌త్నం నేప‌థ్యంలో ప్ర‌స్తుతం పాద‌యాత్ర‌కు రెండు వా రాల‌కు పైగా గ్యాప్ వ‌చ్చింది. నిజానికి జ‌గ‌న్ పెట్టుకున్న షెడ్యూల్ ప్ర‌కారం ఈ పాద‌యాత్ర న‌వంబ‌రు నెల ఆఖ‌రుకు పూర్తి కావాలి. ఇక‌, డిసెంబ‌రు నుంచి ఆయ‌న బ‌స్సు యాత్ర‌కు సిద్ధం కావాలి. అయితే, అనూహ్యంగా జ‌రిగిన హత్యా య‌త్నం నే ప‌థ్యంలో పాద‌యాత్ర నిలిచిపోయింది అయితే, దీనిని తిరిగి ప్రారంభించేందుకు జ‌గ‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు. కానీ, వై ద్యులు మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్‌కు రెస్ట్ అవ‌స‌రం అంటూ .. ఆయ‌న‌ను ఊర‌డిస్తున్నారు.dc-Cover-3c436ntveo560q2rqes60tcsv6-20171123075757.Medi

కానీ, ఎన్నిక‌ల‌కు స‌మ‌యంం మించిపోతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇక‌, ఎలాగైనా స‌రే ఈ నెల 12 నుంచి పాద‌యాత్ర‌ను తిరి గి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలుస్తోంది. కాగా, తా జాగా జ‌రిగిన విశాఖ దాడి నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌కు స్వ‌యంగానే భ్ర‌ద‌త క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకు న్నా రు. ఈ క్ర‌మంలో 20 నుంచి 30 మంది యువ‌కుల‌కు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇప్పించి.. పోలీసుల భ‌ద్ర‌త‌కు ఆవ‌ల జ‌గ‌న్‌కు ర‌క్ష ణ క‌ల్పించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌లో భాగంగా వాలంటీర్ల‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉండ‌డంతో ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.66361057

ఇదిలావుంటే, ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత గ్యాప్ రాలేదు. జ‌గ‌న్‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోయినా.. ఆయ‌న ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మ‌య్యారు. కానీ, ఇప్పుడు వైద్యుల సూచ‌న‌ల మేర‌కు జ‌గ‌న్‌.. బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్న పాద‌యాత్ర‌కు అనూహ్య‌మైన స్పంద‌న‌ల‌భించే అవ కాశం ఉంద‌ని తెలుస్తోంది. జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన త‌ర్వాత‌.. ఆయ‌న ఆరోగ్యంపై ప్రజ‌లు ఆత్రృత‌నే ప్ర‌ద‌ర్శించారు. జ‌గ‌న్ ను చూసేందుకు జ‌నాలు మ‌రింత ఎక్కువ‌గా త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే అధికారులు కూడా గుర్తిం చారు. ఈ నేప‌థ్యంలో మ‌రింత భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర మ‌రింత సంచ‌ల నం కానుంది.

జ‌గ‌న్ యాత్ర‌కు సొంత సైన్యం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share