`అన్న‌`ను మించిన జ‌గ‌న్‌

July 23, 2019 at 1:35 pm

ఒక్క‌సారి అధికారం ఇచ్చి చూడండి.. వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న దిశ‌గా న‌డిపిస్తాను. ఎలాంటి మార్పు చేస్తానంటూ.. గ‌తంలో మీరు ఎన్న‌డూ చూడ‌ని స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను మీకు ప‌రిచ‌యం చేస్తాను!- 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వై సీపీ అధినేత హోదాలో జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఇది. ప్ర‌జ‌లు ఈ మాట‌నే విశ్వ‌స‌నీయంగా భావించి ఉంటారు. బ‌హుశ జ‌గ న్ ఊహ‌కైనా అంద‌ని విధంగా భారీ సంఖ్యాబలంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ్య‌వ‌స్థ ప్ర‌క్షా ళ‌న దిశ‌గా అడుగులు వేయ‌డం ప్రారంభించారు. తొలుత గ్రామ వాలంటీర్లు, గ్రామ స‌చివాల‌యాల ఏర్పాటును జ‌గ‌న్ భు జానికెత్తుకున్నారు.

ఈ క్ర‌మంలోనే దాదాపు 1.33 ల‌క్ష‌ల మంది శాశ్వ‌త గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు, 4 ల‌క్ష‌ల పైచిలుకు గ్రామ వలంటీర్ల ఉ ద్యోగుల నియామ‌కాలు చేప‌ట్టారు. ఇది పైకి క‌నిపిస్తున్న విధానం. అయితే, దీని వెనుక చాలా వ్యూహం ఉంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో అన్న ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స్వ‌ల్ప కాలంలోనే అధికారం చేప‌ట్టిన నేప‌థ్యంలో ఆ య‌న గ్రామ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లారు.

క‌ర‌ణం, మున‌సుబు వ్య‌వ‌స్థ‌ను ఎత్తి వేసి.. గ్రామాల్లో వ్య‌వ‌స్థ‌ను స‌వ‌రించేందుకు, ముఖ్యంగా రైతులు, సాధార‌ణ ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను పెంచేందుకు అప్ప‌ట్లో అన్న‌గారు ప్ర‌య‌త్నించారు. అన్న‌గారి ఆశ‌లు ఫ‌లించాయి. క‌ర‌ణం, మున‌సుబు వ్య‌వ‌స్థ‌లు పోయాయి. అయితే, గ్రామ స్వ‌రాజ్యం మాత్రం వ‌చ్చిందా? అంటే ప్ర‌శ్నార్థ‌కంగానే మారింది. ఎక్క‌డిక‌క్క‌డ పెత్తందారీ వ్య‌వ‌స్థ, కేవ‌లం స‌ర్పంచ్ చేతిలోనో.. లేదా కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల చేతుల్లోనే గ్రామీణ వ్య‌వ‌స్థ మొత్తం బందీ అయింది. ఫ‌లితంగా ప్ర‌తి ప‌నికీ గ్రామీణ ప్ర‌జ‌లు రాజ‌కీయ నేత‌ల చుట్టూ కాళ్లీడ్చుకుంటూ తిర‌గాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

ప్ర‌భుత్వం నుంచి ఏ చిన్న ప‌ని జ‌ర‌గాల‌న్నా.. గ్రామాల్లో రాజ‌కీ యాలు లేకుండా జ‌ర‌గడం లేదు. త‌న పాద‌యాత్ర‌లో దీనిని గుర్తించిన జ‌గ‌న్‌.. గ్రామాల్లో పెత్తందారి వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసి.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వాన్ని చేరువ చేసే క్ర‌మంలో వేసిన అడుగుగానే ప్ర‌స్తుతం ఆయ‌న చేప‌ట్టిన గ్రామ వలంటీర్ల వ్య‌వ‌స్థ‌. ఇది క‌నుక స‌క్సెస్ అయితే, ఇక‌, గ్రామాల్లో పెత్తందారీ వ్య‌వ‌స్థ స‌హా రాజ‌కీయ వ్య‌వ‌స్థ కూడా ప్ర‌క్షాళ‌న జ‌రగడం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

`అన్న‌`ను మించిన జ‌గ‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share