ఆ రెండు ఎంపీ సీట్ల‌లో జ‌గ‌న్ ప్ర‌యోగం ఫ‌లించేనా..!

May 6, 2019 at 2:25 pm

అధికార తెలుగు దేశం పార్టీకి కంచుకోట‌గా ఉన్న జిల్లాల్లో రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం ఒక‌టి. ఇక్క‌డ రెండు ఎంపీ స్థానాలు అనంత‌పురం, హిందూపురం ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ రెండు స్థానాల‌ను కూడా టీడీపీ కైవ‌సం చేసుకుంది. అయితే, ఇప్పుడు ఇక్క‌డ టీడీపీ హ‌వా ఎలా ఉంది? గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఇక్క‌డ విజ‌య దుందుభి మోగిస్తుందా? అనే చ‌ర్చ సాగుతోంది. అనంత‌పురం ఎంపీగా గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిన జేసీ దివాక‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు. ఇక‌, హిందూపురంలో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న నిమ్మ‌ల కిష్ట‌ప్ప గ‌త ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించారు.

ఇక‌, తాజాగా గ‌త నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల విష‌యాన్ని తీసుకుంటే.. అనంత‌పురం నుంచి జేసీ త‌ప్పుకొని ఆయ‌న త‌న‌యు డు ప‌వ‌న్ కుమార్ రెడ్డికి అవ‌కాశం ఇప్పించుకున్నారు. హిందూపురంలోనూ కిష్ట‌ప్ప త‌న త‌న‌యుడికి అవ‌కాశం ఇవ్వ‌మ‌ని అడిగినా.. ప్ర‌స్తుతానికి కిష్ట‌ప్ప‌కే చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. దీంతో ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థులు గా వారే బ‌రిలోకి దిగారు. అదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇక్క‌డ ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌య్యారు. టీడీపీ ఇద్ద‌రూ ఓసీ అభ్య‌ర్థుల‌కు టికెట్ ఇస్తే.. వైసీపీ అధినేత మాత్రం బీసీ వ‌ర్గానికి ప‌ట్టంక‌ట్టారు. అనంత‌పురం నుంచి త‌లారి రంగ‌య్య‌కు అవ‌కాశం ఇచ్చిన జ‌గ‌న్‌.. హిందూపురం నుంచి వీఆర్ ఎస్ తీసుకున్న పోలీస్ సీఐ గోరంట్ల మాధ‌వ్‌కు ఛాన్స్ ఇచ్చారు.

జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌యోగంతో అనంత‌రంలో పొలిటిక‌ల్ అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఎవ‌రు గెలుస్తారు? అనే చ‌ర్చ సాగుతోంది. గ‌తంలో ఉన్న బ‌లం నిజానికి ఇప్పుడు టీడీపీకి త‌గ్గిపోయింది. నాయ‌కుల‌పై ప్ర‌జ‌ల్లో పెరిగిన వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే, బల‌మైన అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌డంతో ప్ర‌జ‌లు ఎవ‌రి ప‌క్షాన ఓటు వేశార‌నేది మాత్రం అంచ‌నాలకు అంద‌డం లేదు. నిజానికి సంప్ర‌దాయ ఓటు బ్యాంకు టీడీపీకి ప‌డి ఉంటే మాత్రం అనంత‌లో మ‌ళ్లీ రెండు ఎంపీ సీట్ల‌ను టీడీపీ కైవ‌సం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కానీ, వైసీపీ నుంచి బ‌రిలో నిలిచిన ఇద్ద‌రు బీసీ నాయ‌కులు కూడా హోరా హోరీ త‌ల‌ప‌డ్డారు. డ‌బ్బులు కూడా బాగానే ఖ‌ర్చు పెట్టారు. దీంతో టీడీపీ గెలిచినా.. మెజారిటీ ఆశించిన మేర‌కు ద‌క్కే ఛాన్స్ లేద‌ని అంటున్నారు. ముఖ్యంగా హిందూపురంలో టీడీపీ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క కాద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ఆ రెండు ఎంపీ సీట్ల‌లో జ‌గ‌న్ ప్ర‌యోగం ఫ‌లించేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share