జ‌గ‌న్‌కు సీఎం సీటు స్వీటు కాదు.. హాటే.. రీజ‌న్ ఇదే..!

April 30, 2019 at 4:18 pm

ఏపీ విప‌క్షం నాయ‌కుడు, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌.. ఏపీ సీఎం కావాల‌నేది ఆ పార్టీ నాయ‌కుల ప్ర‌ధాన కోరిక‌. ఇక‌, జ‌గ‌న్ కు కూడా సీఎం సీటు ఎక్క‌డం, క‌నీసం 30 ఏళ్ల‌పాటు రాష్ట్రాన్ని పాలించ‌డం అనేది ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఉంది. దీనిని ఆయ నే ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు. సో.. మొత్తానికి ఏపీ సీఎం ప‌ద‌విపై జ‌గ‌న్ మ‌న‌సు పెట్టుకున్నారు. స‌రే! తాజాగా ఏప్రిల్ 11న ఎన్నిక‌లు ముగిశాయి. హోరా హోరీగా సాగిన ఎన్నిక‌ల పోరులో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్టుగానే ఎన్నిక‌ల పోటీ జ‌రిగింది. ఎవ‌రికి వారు గెలుపుపై ధీమా వ్య‌క్తం చేశారు. మాదంటే మాదేన‌ని గెలుపుపై అంచ‌నాలు వేసుకున్నారు. ఈ క్ర‌మంలో బెట్టింగుల జోరు కూడా భారీ ఎత్తున పెరిగింది. ఒక వేళ వైసీపీ అంచ‌నాల‌కు అనుగుణంగా ఆ పార్టీనే అధికారం లోకి వ‌చ్చింద‌ని అనుకుందాం.

వైఎస్ జ‌గ‌న్ సీఎం ప‌ద‌విని చేపట్టార‌ని భావిద్దాం. మ‌రి ఈ సీటు ఆయ‌న స్వీటుగానే ఉంటుందా? ఆయ‌న ముందు ఇప్ప టికిప్పుడు ఉన్న స‌వాళ్లు ఎలాంటివి? వీటిని అధిగ‌మించేందుకు జ‌గ‌న్ వేసే ప్లాన్లు ఎలాంటివి? అనే చ‌ర్చ కూడా జోరుగా నే సాగుతోంది. విభ‌జ‌న త‌ర్వాత ఏపీ 16 వేల కోట్ల లోటు బ‌డ్జెట్‌లో ఉంది. ఇది ఐదేళ్ల కింద‌టి మాట‌. ఈ లోటు నానాటికీ పెరుగుతూ వ‌చ్చింది. ఇక‌, ప్ర‌స్తుత చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన వ్య‌యం, ఉచితాల పంపిణీ, సంక్షేమ పింఛ‌న్ల పెంపు వంటి వాటిద్వారా ఈ లోటుతో పాటు అప్పులు కూడా రాష్ట్రం వెన్నును వంచేస్తున్నాయి. దీంతో సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టినా.. ఆయ‌న ముందు ఆర్థికంగా అనేక స‌వాళ్లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి.

బ్యాంకుల నుంచి అప్పులు పుట్ట‌ని ప‌రిస్థితిలో ఏపీ ఓవ‌ర్ డ్రాఫ్ట్‌కు కూడా వెళ్లింది. ఇక‌, హ్యాపీనెస్ట్ పేరుతో చేప‌ట్టిన ప్రాజెక్టు ల ద్వారా ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు సేక‌రించారు. ఇక‌, అమ‌రావ‌తి బాండ్ల విక్ర‌యం ఇలా అనేకానేక రూపాల్లో ఇప్పుడు ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇదిలావుంటే, అమ‌రావ‌తి నిర్మాణం, పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌డం, పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌డం వంటివి జ‌గ‌న్‌కు మ‌రిన్ని స‌వాళ్లు రువ్వే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఇక‌, పెంచిన ఫించ‌న్ల పంపిణీ, జ‌గ‌న్ త‌న మేనిఫెస్టోలో పేర్కొన్న ఉచితాలు, విద్యార్థుల‌ను స్కూల్కు పంపే చిన్నారుల త‌ల్లి ఖాతాలో 15 వేలు, రైతుల‌కు పెట్టుబ‌డి రుణం కింద 12500. ఇలాంటి ప‌థ‌కాల‌కు నిధులు స‌మ‌కూర్చాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు సీఎం ప‌ద‌వి అంత ఈజీకాద‌ని, అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్‌కు సీఎం సీటు స్వీటు కాదు.. హాటే.. రీజ‌న్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share