ఆకారణం వల్లనే వైసీపీలో జోష్ !

April 16, 2019 at 11:16 am

ఏపీ సార్వ‌త్రిక ఎన్నికల ఫ‌లితాల‌పై ఎవ‌రి విశ్లేష‌ణ‌లు వారు చేస్తున్నారు. ఓ వ‌ర్గం మీడియా ఈ ఎన్నిక‌లు కేవ‌లం అధికార పార్టీకి పాజిటివ్‌గా వ‌ర్ణించ‌డంలో త‌ల‌మున‌క‌లు అవుతోంది. ఇక‌, ఎన్నిక‌ల స‌ర‌ళి, పోలింగ్ న‌మోదైన స్థాయి వంటి వాటిని అంచ‌నా వేసుకుంటే. సాధార‌ణ ప్ర‌జానీకం మొత్తం కూడా రాష్ట్రంలో మార్పు కోరుకున్న ప‌రిస్థితి క‌నిపించింది. ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో పోటెత్తిన ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి సాధార‌ణంగా ఉండే విశ్లేష‌ణ‌ల‌ను మించి ఇప్పుడు ఏపీలో విశ్లేష‌ణ లు సాగుతున్నాయి. పోటెత్తిన జ‌నాభాను చూస్తే.. అధికార పార్టీకి వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌హిళ‌లు ఎక్క‌డిక‌క్క‌డ భారీ సంఖ్య‌లో పోలింగ్‌ బూత్‌ల‌కు క్యూ క‌ట్టారు.

వీరిని ప‌రిశీలిస్తే.. రాష్ట్రంలో మార్పును కోరుకుంటున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపించింది. నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో టీడీపీ అధినేత‌, ప్ర‌భుత్వ సార‌థిగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు న‌వ్వుల పాలైన మాట వాస్త‌వం. ఒక్క ప్ర‌త్యేక హోదా విష‌యంలోనే కాకుండా.. రాష్ట్రంలో అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలోనూ చంద్ర‌బాబు వేసిన అడుగులు న‌వ్వుల పాల‌య్యాయి. ముందు హోదా వ‌ద్ద‌న్న నాయ‌కుడే .. త‌ర్వాత హోదా కోసం అరిచి గీ పెట్టి.. ధ‌ర్మ పోరాట దీక్ష‌ల పేరిట ఢిల్లీలో క‌దం తొక్కిన ప‌రిస్థితిని ప్ర‌తి ఒక్క‌రూ నెగిటివ్‌గానే తీసుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అధికారం లో ఉండి, నాలుగున్న‌రేళ్లు బీజేపీతో అంట‌కాగిన నాయ‌కుడు ఏపీకి ఏం చేశార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఇక‌, తెలంగాణ అధినేత కేసీఆర్ తో జ‌గ‌న్ చేతులు క‌లిపాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయితే, డిసెంబ‌రులో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్‌తో చేతులు క‌లిపేందుకు, ఆ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసేందుకు చంద్ర‌బాబు ఏ విధంగా త‌హ‌త‌హ లాడిందీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అనేక సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ప‌క్క రాష్ట్రంతో స్నేహంగా ఉండ‌క‌పోతే.. న‌ష్ట‌పోతామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. జ‌గ‌న్ విష‌యానికి వ‌చ్చేస‌రికి, త‌న కొంప ఎక్క‌డ కొల్లేర‌వుతుందోనని గ్ర‌హించి జ‌గ‌న్‌-కేసీఆర్‌లపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు సంధించారు. ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నించ‌కుండా ప్ర‌జ‌లు ప‌క్కాగా చంద్ర‌బాబుకు గుద్దేశారంటే.. న‌మ్మ‌లేం!

ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఏ విష‌యంలోనైనా.. ఆయ‌న మాట‌పైనే నిల‌బ‌డ్డారు. తాను ఒక్క‌సారి ఒక్క‌మాట ఇస్తే.. వెన క్కి తీసుకున్న సంద‌ర్బాలు క‌నిపించ‌డం లేదు. ఓదార్పు యాత్ర కోసం కొన్ని ద‌శాబ్దాల రాజ‌కీయ‌ప్ర‌యాణ గ‌మ‌నా న్ని మార్చుకుని సొంత పార్టీ స్థాపించుకున్నారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, దీనికి ముందు కూడా ప్ర‌త్యేక హోదా పై పోరాటం ప్రారంభించిన నాయ‌కుడు జ‌గ‌నేన‌ని చెప్పాలి. అదేస‌మ‌యంలో హోదా ఇచ్చే పార్టీకి మ‌ద్ద‌తిస్తామ‌ని చెప్పా రు. మొత్తంగా చూసుకుంటే.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు విశ్వ‌స‌నీయ‌త‌కు-అవినీతికి జ‌రిగిన పోరుగానే దీనిని చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ప‌రిణామం జ‌గ‌న్‌కు అనుకూలించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. పాద‌యాత్ర ఎఫెక్ట్్ స‌హా.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కూడా పోలింగ్ బూతుల్లో ప్ర‌జ‌లు క్యూ క‌ట్ట‌డానికి కార‌ణ‌మైంద‌ని అంటున్నారు.

ఆకారణం వల్లనే వైసీపీలో జోష్ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share