ఢిల్లీ వేదిక‌గా వైసీపీ వ్యూహం.. బాబుకి ఇక భరతమే!

November 1, 2018 at 11:43 am

విప‌క్ష నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రిని నిన్న మొన్న టి వ‌ర‌కు రాష్ట్ర నేత‌లు ఖండించారు. అయితే ఇప్పుడు మాత్రం బాబు వైఖ‌రిని కేంద్రంలోని కొంద‌రు నాయ‌కులు సైతం ముఖ్యంగా నిన్న గాక మొన్న ఢిల్లీ వెళ్లి.. త‌న‌కు మ‌ద్ద‌తిస్తున్నార‌ని చెప్పుకొన్న జాతీయ నేత‌లు సైతం బాబు వైఖ‌రిపై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి రాజ‌కీయాల్లో త‌న‌క‌న్నా పోటుగాడు లేడ‌ని బాహాటంగానే చెప్పుకొనే చంద్ర‌బాబుకు ఇప్పుడు ఢిల్లీలోనూ వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విమానాశ్ర‌యంలో దాడి జ‌రిగిన వెంట‌నే చంద్ర‌బా బు.. ఢిల్లీ వెళ్లారు. జ‌గ‌న్ త‌న‌పై తానే దాడి చేయించుకుని.. దానిని రాజ‌కీయంగా మార్చి సింప‌తీ కోసం వెతుకుతున్నార‌ని అన్నారు.18VJPG4-YSRCP

నిజానికి చంద్ర‌బాబుకు ఢిల్లీలోని కొంద‌రి ద‌గ్గ‌ర ఉన్న ప‌లుకుబ‌డి నేప‌థ్యంలో ఇది నిజ‌మేన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, తాజాగా వైసీపీ నాయ‌కులు కూడా ఢిల్లీ వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నాయి. ఎక్క‌డైతే.. చంద్ర‌బాబు.. వైసీపీ నేత‌ను బ‌ద్నాం చేశాడో.. అక్క‌డే బాబును కూడా బ‌ద్నాం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రాజ‌కీయాలు మీకు మాత్రమే కాదు.. మాకు కూడా తెలుసు! అనే ధోర‌ణిని నాయ‌కులు అవ‌లంబించారు. తాజాగా ఢిల్లీ వెళ్లిన వైసీపీ నాయ‌కులు.. అక్క‌డి జాతీయ నాయ‌కులు శ‌ర‌ద్ ప‌వార్ స‌హా ప‌లువురుని క‌లుసుకుని జ‌గ‌న్‌పై దాడిని వివ‌రించారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు బాబు చెప్పిందే నిజ‌మ‌ని న‌మ్మిన శ‌ర‌ద్ ప‌వార్ తాజాగా వైసీపీ నేత‌లు వెలువ‌రించిన విష‌యాల‌తో ఆశ్చ‌ర్య‌పోయారు.YCP-Leaders-in-Delhi-Whats-Cooking

ఇది ముమ్మాటికీ త‌ప్ప‌ని, ఇలాంటి క‌క్షా రాజ‌కీయాలకు ప్ర‌జాస్వామ్యంలో అవ‌కాశం లేద‌ని అన్నారు. పైగా.,. ఓ విప‌క్ష నాయ‌కుడుకి ఇంత జ‌రిగితే.. చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్ భేష‌జాల‌కు పోకుండా ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించి ఉంటే బాగుం డేద‌నే అభిప్రాయాన్ని ప‌వార్ వెల్ల‌డించారు. ఇక‌, ఈ రిజ‌ల్ట్‌తో వైసీపీ నాయకులు మ‌రింత‌గా దూసుకుపోవాల‌ని నిర్ణయిం చారు. రాబోయే రోజుల్లో కేంద్రంలోని జాతీయ పార్టీల‌ను కూడ‌గ‌ట్టి.. బాబును ఎండ‌గ‌ట్ట‌డంపైనే దృష్టి పెట్ట‌నున్నారు. నిజానికి ఈ ప‌రిణామాన్ని టీడీపీ నేత‌లు కూడా ఊహించి ఉండ‌రు. అయితే, బాబు నుంచి ఎదురవుతున్న దాడిని త‌ట్టుకునేందుకు, పార్టీని జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేందుకు వైసీపీ నాయ‌కులు తాజాగా ప్రారంభించిన కార్య‌క్ర‌మానికి స‌ర్వ్ర‌తా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

ఢిల్లీ వేదిక‌గా వైసీపీ వ్యూహం.. బాబుకి ఇక భరతమే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share