అమెరికాలో ఆంధ్రా సీఎంకు అదిరిపోయే క్రేజ్ …

August 12, 2019 at 11:13 am

ఆంధ్రా సీఎం జగన్ మోహన్ రెడ్డికి అమెరికాలో అదిరిపోయే క్రేజ్ వచ్చింది. ఈ నెల 17న జగన్ డల్లాస్ లో ప్రవాసాంధ్రులతో భేటీ కానున్న విషయం తెలిసిందే. ఆయన అమెరికా పర్యటన నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐలు స్వాగత కార్యక్రమాలు అదిరిపోయే రేంజ్ లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై సెల్ విభాగం నాయకులు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలను చేపట్టారు. కాగా, ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం జగన్ అమెరికాకు బయలుదేరి వెళ్తారు.

వారం రోజుల పాటు జగన్ అమెరికాలోనే ఉండనున్నారు. మళ్ళీ ఈ నెల 23న ఆయన ఏపీకి తిరిగిరానున్నారు. ఇక వైఎస్ జగన్ ఈ నెల 17న డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తెలుగువారికి చెందిన ఆయా సంస్థలు, సంఘాల ప్రతినిధులు, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. అందుకే ఈ కార్యక్రమానికి సంబంధించిన హోర్డింగులు, బ్యానర్లు డల్లాస్ లో వెలిశాయి. మునుపెన్నడూ లేని విధంగా నాటా ప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టారు.

కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటయ్యే సీఎం కార్యక్రమానికి అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా ఆహ్వానపత్రాలను అందజేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన సమయంలో ఇదే కన్వెన్షన్ సెంటర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అప్పుడు పెద్ద ఎత్తున అమెరికా ప్రజలు పాల్గొన్నారు. దాని తరువాత ఇంత భారీగా ఓ రాజకీయ కార్యక్రమాన్ని చేయడం ఇదే అని వైఎస్సార్ ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు అంటున్నారు. మొత్తానికి అమెరికాలో ఆంధ్రా సీఎం మేనియా నడుస్తోంది.

అమెరికాలో ఆంధ్రా సీఎంకు అదిరిపోయే క్రేజ్ …
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share