కాబోయే సీఎం జ‌గ‌న్ అంటున్న ప‌చ్చ మీడియా…!

May 16, 2019 at 2:04 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా జ‌గ‌న్ కాబోవుతున్నాడ‌ని లోకం కూడై కూస్తున్న త‌రుణంలో ఎల్లో మీడియా కూడా త‌న రూటు మార్చుకోక త‌ప్ప‌డం లేదు. ఇంత‌కాలం చంధ్ర‌బాబు జ‌పం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు జ‌గ‌న్ వైపు జాలీ చూపులు చూస్తుంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఏంటీ ప‌రిస్థితి, భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతుందనే ఆందోళ‌న‌లో ఎల్లో మీడియా ప‌డిపోయింద‌ని అందుకే జ‌గ‌న్ జ‌పం చేసేందుకు రిహార్స‌ల్ చేస్తుంద‌నే టాక్ వినిపిస్తుంది. వైఎస్సార్ పార్టీ ఆధినేత జ‌గ‌న్‌పై నిత్యం నిప్పులు కురిపించి, విష ప్ర‌చారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే అంటూ సాగ‌దీత‌లు ప్రారంభించింది. అందుకు త‌గిన విధంగా జ‌గ‌న్‌కు అనుకూలంగా రాస్తూ, బాబు అధికారంలోకి రాడ‌నే సంకేతాలు ఇస్తుంది.

టీడీపీ అనుకూల మీడియాగా ఉన్న ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక ఎన్న‌డు లేని విధంగా వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వ‌స్తే అంటూ మొద‌టి పేజీలో వార్త‌ను వండి వార్చింది. ఆంధ్ర‌జ్యోతి అధిప‌తి వేమూరి రాధాకృష్ణ ఇప్పుడు త‌న వైఖ‌రిని మార్చుకున్నారు. వైఎస్సార్ పార్టీ అధికారంలో వ‌చ్చి జ‌గ‌న్ సీఎం అయితే ప్ర‌భుత్వంపై 56వేల కోట్ల రూపాయ‌ల అధ‌నం భారం ప‌డుతుంద‌ని ఆర్థిక శాఖ అంచ‌నా వేసింద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొంది. వైఎస్సార్ పార్టీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేయాలంటే 56వేల కోట్ల భారం అవుతుంద‌ట‌. టీడీపీ ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాల పేర్లు మార్చ‌క త‌ప్ప‌ద‌ని అందులో రాసారు.

ఏపీలో టీడీపీ ఓట‌మి చెంది, వైఎస్సార్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయ‌మ‌ని స‌ర్వేలు చెపుతున్నాయ‌ని, అలా జ‌రిగితే జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే జూన్ నుంచే ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేయ‌డం ఖాయ‌మ‌ని ఎల్లోమీడియా ప్ర‌చురించింది. అందుకు త‌గిన విధంగా ఏ ప‌థ‌కాల‌కు ఎంత‌మేర‌కు ఖ‌ర్చులు అవుతాయోన‌ని ఆ వార్తాక‌థ‌నంలో వివరించే ప్ర‌య‌త్నం చేసింది ఎల్లో మీడియా. ఏదేమైనా జ‌గ‌న్ సీఎం అవుతున్నాడ‌నే వార్త రాసి ఎల్లో మీడియా రూట్ మార్చింద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది. ఆంధ్ర‌జ్యోతితో పాటు ఈనాడు కూడా త‌న రూటు మార్చుకొన్న‌ట్లు తెలుస్తుంది.

కాబోయే సీఎం జ‌గ‌న్ అంటున్న ప‌చ్చ మీడియా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share