జ‌గ‌న్‌కో సూచ‌న‌: చేత‌లే కీల‌కం.. మాట‌లు కాదు

June 14, 2019 at 3:26 pm

175 మంది(స్పీక‌ర్‌తో స‌హా) కొలువు దీరిన ఎమ్మెల్యేలు కొలువుదీరిన ఏపీ అసెంబ్లీ వేదిక‌గా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌, స‌భ‌ల హుందాత‌నం, రాజ్యాంగ విలువల ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించ‌డం ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర లో సువ‌ర్ణాధ్యాయం. లుప్త‌మ‌వుతున్న రాజ‌కీయ విలువ‌ల‌ను కాపాడ‌తాన‌ని చెప్ప‌డాన్ని ప్ర‌జాస్వామ్య వాదులు నిండు మ‌న‌సుతో ఆహ్వానిస్తున్నారు. దేశ రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు భిన్నంగా తాను రాజ‌కీయాల‌ను శాసిస్తాన‌ని, స‌రికొత్త అధ్యాయం దిశ‌గా అడుగులు వేస్తాన‌ని శాస‌న స‌భ సాక్షిగా వెల్ల‌డించ‌డం చిన్న వ‌య‌సులోనే పెద్ద మ‌న‌సున్న నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు తెచ్చుకున్నారు.

పార్టీలు ఏవైనా కూడా ఒక్క టీడీపీ అనే కాదు.. దేశంలోని అనేక రాజ‌కీయ పార్టీలు కూడా ప్ర‌భుత్వాల ఏర్పాటు కోసం, అధి కారంలోకి వ‌చ్చేందుకు తొక్కుతున్న నీచ దారులు అనేకం మ‌న‌ముందు క‌నిపిస్తున్నాయి. కాశ్మీర్ నుంచి క‌న్యాకు మారి వ‌ర‌కు ఎందెందు వెత‌కి చూచినా(ఏరాష్ట్రంలో చూసినా).. అందందే.. ప్ర‌జాస్వామ్య భార‌తి క‌న్నీటి ప‌ర్యంత మ‌వు తు న్న ప‌రిస్థితి క‌నిపి స్తోంది. ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్ట‌డం, ప్ర‌తిప‌క్షాల‌ను నిర్జీవం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ల‌జ్జా విహీన రాజ‌కీయాలు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. వీటిని త‌న‌దైన శైలిలో అడ్డుకునేందుకు ప్ర‌తిన బూనిన జ‌గ‌న్ వంక ఇప్పుడు రాష్ట్ర‌మే కాకుండా రాష్ట్రేత‌ర నాయ‌కులు కూడా ఆబ‌గా చూస్తున్నారు.

అయితే, ఇది కేవ‌లం ఒక పార్టీ నుంచి మ‌రొక పార్టీలోకి మారే నాయ‌కుల‌కే ప‌రిమితం అయితే.. జ‌గ‌న్ ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌డం క‌ష్ట‌మే అవుతుంది. అంతేకాదు, కేవ‌లం త‌ను నీతిమంతుడుగానే ఉండ‌డం కాదు.. త‌న బృందాన్ని కూడా నీతిమంతంగా ఉంచాల్సిన అవ‌స‌రం ఇప్పుడు జ‌గ‌న్‌పై ఉంది. తాజాగా జ‌రిగిన తొలి స‌భలో మ‌లి రోజు చోటు చేసుకున్న ఘ‌ట‌న వంటిది పున‌రావృతం కారాద‌నేది కూడా ప్ర‌జాస్వామ్య వాదుల అభిలాష. గ‌తంలో మీరు మ‌మ‌ల్ని ఎన్ని తిప్ప‌లు పెట్టారో .. అంత‌కంటే ఎక్కువ‌గా మీకు సినిమా చూపిస్తాం అనే ధోర‌ణిలో నే తొలి స‌భ‌లో మ‌లిరోజు కార్య‌క్ర‌మాలు జ‌రిగాయ‌న‌డంలో సందేహం లేదు.

ఉచితానుచితాలు మ‌రిచి తొటి స‌భ్యుణ్ని `బంట్రోతు`తో పోల్చ‌డాన్ని ఎవ‌రూ స‌హించే ప‌రిణామం కానేకాదు. పార్టీలు ఏవైనా.. స‌భ‌లోకి వ‌చ్చాక వారంతా కొన్ని ల‌క్ష‌ల మందికి ప్ర‌తినిధులు అన్న విష‌యాన్ని అధికార పార్టీ గుర్తించాల్సిన అస‌వ‌రం ఉంది. అది జ‌ర‌గ‌క‌పోయినందునే.. అప్ప‌టి అధికార ప‌క్షం నేడు చావుత‌ప్పిన చందంగా అసెంబ్లీలో అణిగిమ‌ణిగి కూర్చునే ప‌రిస్తితికి దిగ‌జారిపోయింది. ఇలాంటి ప‌రిస్తితి త‌న‌కు దాపురించ‌కుండా చూస్తుకుంటాన‌న్న జ‌గ‌న్‌.. కేవ‌లం పార్టీలు మారేవారితో రాజీనామా చేయించ‌డంతోనే స‌రిపెట్ట‌డం కాకుండా స‌భ హుందాత‌నాన్ని కూడా స‌రిచూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ క్రమంలో త‌న పార్టీలోని కొంద‌రునాయ‌కుల నోటికి తాళం వేయ‌డం కూడా అవ‌స‌రం అనేది విజ్ఞుల మాట‌. ఉచితానుచితాలు మ‌రిచిపోకుండా ఉన్న త‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగి.. స‌భ ప‌రిఢ‌విల్లిన నాడే.. జ‌గ‌న్ కోరుకున్న ప్ర‌జాస్వామ్య ప‌రిఢ‌విల్లేది!

జ‌గ‌న్‌కో సూచ‌న‌: చేత‌లే కీల‌కం.. మాట‌లు కాదు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share