జగన్ క్యాబినెట్ రెడీ …జాబితా ఇదే !

May 16, 2019 at 3:13 pm

ఏపీలో అధికారం మార‌బోతుందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది తెలుగునాట‌. ఈ సారి వైఎస్ఆర్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని ఓవైపు ఫోల్ స‌ర్వేలు, మ‌రో వైపు మీడియా ధీమాగా చెపుతున్నాయి. చివ‌రాఖ‌రికి టీడీపీని అంట‌కాగే ఎల్లో మీడియా కూడా వైఎస్సార్ సీపీ అధికారంలోకి వ‌స్తుంద‌నే అంటుంది. ఏదేమైనా టీడీపీ ఓడిపోయి ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ పార్టీ అధికారంలోకి రావ‌డం త‌ప్ప‌ద‌నే సంకేతాలు వెలువ‌డుతున్న త‌రుణం.

అధికార తెలుగుదేశం ఓడిపోయి వైఎస్సార్ పార్టీ గెలిస్తే, జ‌గ‌న్ సీఎం అయితే మంత్రులెవ్వ‌రు అవుతారో అనేది ఇప్ప‌టి నుంచే ఉత్కంఠ‌గా మారింది. కొంద‌రు సీనియ‌ర్లు తామే మంత్రుల‌మ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. మ‌రోవైపు త‌న అనుచ‌రుల చేత ప్లెక్సీలు, బ్యాన‌ర్లు క‌ట్టిస్తున్నారు. ఏకంగా కొంద‌రు స్టిక్ట‌ర్లు త‌యారు చేసుకొని వాట‌ర్ బాటిల్ల‌పై అంటించుకుంటున్నారు. సీనియ‌ర్ నేత‌లు త‌మ‌కే మంత్రిగా అవ‌కాశం వ‌స్తుంద‌నే ధీమాతో ఉన్నారు.

జ‌గ‌న్ క్యాబినెట్‌లో త‌మ‌కు త‌ప్ప‌క అవ‌కాశం దొరుకుతుంద‌ని అనేక మంది నేత‌లు క‌ల‌లు కంటున్నారు. వీరి క‌ల‌ల‌ను క‌ల్ల‌లు చేసేలా ఓ డ్రీం క్యాబినెట్ త‌యారు అయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. జ‌గ‌న్ యాత్ర‌లు జ‌రుపుతూ వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా త‌న క్యాబినెట్ కూర్పుపై క‌స‌ర‌త్తు చేస్తున్నాడ‌ని అంటున్నారు. అందుకు త‌గిన విధంగా ప‌లు స‌మీక‌ర‌ణ‌లు చేసి క్యాబీనెట్‌ను రూపొందించిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. జ‌గ‌న్ క్యాబీనెట్‌లో త‌న తండ్రి క్యాబినెట్‌లో ప‌నిచేసిన సీనియ‌ర్ల‌ను విస్మ‌రించ‌లేద‌ని తెలుస్తుంది.

వైఎస్సార్ క్యాబినెట్‌కు పెద్ద పీట‌.

జ‌గ‌న్ రూపొందించిన క్యాబినెట్‌ను చూస్తే త‌న తండ్రి క్యాబినెట్‌లో ప‌నిచేసిన వారికి పెద్ద పీట వేసిన‌ట్లుగా తెలుస్తోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క్యాబినెట్‌లో ప‌నిచేసిన బోత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌రావులు ప‌నిచేశారు. వీరికి త‌న మంత్రి వ‌ర్గంలో అధిక ప్రాధ‌న్య‌త ఇస్తున్న‌ట్లు వినికిడి. అదే విధంగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క్యాబినెట్‌లో ప‌నిచేసిన శిల్పా మోహ‌న్‌రెడ్డి సోద‌రుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి అవ‌కాశం ఇస్తున్న‌ట్లు తెలిసింది.

వైఎస్ జ‌గ‌న్ డ్రీం క్యాబినెట్ 26మందితో ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును స్పీక‌ర్‌గా చేయాల‌నే ఆలోచ‌న చేసిన‌ట్లు వినికిడి. ద‌గ్గుబాటిని స్పీక‌ర్ చేస్తే అటు చంద్ర‌బాబుకు, ఇటు బీజేపీ నాయ‌కురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రీల‌ను జ‌గ‌న్ ఇరుకున పెట్టిన‌ట్టేన‌ని రాజ‌కీయ పరిశీల‌కుల అభిప్రాయం.

ముఖ్యమంత్రి : వై యస్ జగన్మోహన్ రెడ్డి

స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు

డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

మంత్రులు …………….శాఖలు
1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -హోంశాఖ
2. బొత్స సత్యనారాయణ – రోడ్లు మరియు భవనాలు
3. ధర్మాన ప్రసాదరావు -రెవెన్యూశాఖ
4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -ఆర్థిక శాఖ
5. కొడాలి నాని -భారీ నీటిపారుదల శాఖ
6. గడికోట శ్రీకాంత్ రెడ్డి -మున్సిపల్ శాఖ
7. తానేటి వనిత -స్త్రీ, శిశు సంక్షేమ శాక
8. పిల్లి సుభాష్ చంద్రబోస్ -పౌర సరఫరాలుశాఖ
9. అవంతి శ్రీనివాస్ -వైద్య ఆరోగ్యశాఖ
10. కురసాల కన్నబాబు -విద్యాశాఖ
11. తమ్మినేని సీతారాం -బీసీ సంక్షేమం
12. శిల్ప చక్రపాణి రెడ్డి -అటవీశాఖ
13. వై. విశ్వేసర్ రెడ్డి -న్యాయశాఖ
14. కోన రఘుపతి -దేవాదాయ ధర్మదాయశాఖ
15. ఆనం రాంనారాయణ రెడ్డి -పంచాయితీరాజ్
16. మోపిదేవి వెంకటరమణ -ఐటీ శాఖ మంత్రి
17. ఆర్. కే. రోజా -విద్యుత్ శాఖ
18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి -భూగర్భ గనులశాఖ
19. గ్రంధి శ్రీనివాస్ -సినిమాటోగ్రఫీ
20. ఆళ్ళ నాని -కార్మిక, రవాణా శాఖ
21. కె. భాగ్యలక్ష్మి – సాంఘీక సంక్షేశాఖ
22. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి -వ్యవసాయ శాఖ మంత్రి
23. అమంచి కృష్ణ మోహన్ -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక
24. కె. ఇక్బాల్ అహ్మద్ -పర్యావరణ శాఖ
25. కొక్కిలిగడ్డ రక్షణనిధి -హౌసింగ్
26. కాకాని గోవర్ధన్ రెడ్డి -భారీ పరిశ్రమల శాఖ

ఈనెల 23న ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి కేబినేట్‌లో మార్పులు చేర్పులు ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలే త‌మ భ‌విష్య‌త్‌ను మార్చుతాయ‌ని ప‌లువురు సీనియ‌ర్లు అంటున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ క్యాబినేట్ ఏదో ఈనెల 25న తేలే అవ‌కాశం ఉన్న‌ట్లు వినికిడి.

జగన్ క్యాబినెట్ రెడీ …జాబితా ఇదే !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share