జ‌గ‌న్ స్వప్నం.. కౌంట్ డౌన్ స్టార్ట్స్‌

August 12, 2019 at 11:43 am

ఏపీ సీఎం జ‌గ‌న్ స్వప్నం ఫ‌లించేందుకు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది! అదేంటి అంటున్నారా? అక్క‌డే అస లు విష‌యం ఉంది. ఏపీ సీఎంగా బాధ్య‌తలు చేప‌ట్టే స‌మ‌యంలోనే త‌న స్వ‌ప్నం, సీఎంగా త‌న ల‌క్ష్యాల‌ను ఆవిష్క‌రించారు వైసీపీ అధినేత‌. రాష్ట్రంలో పార‌ద‌ర్శ‌క పాల‌న‌, ప్ర‌క్షాళ‌న‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంతోపాటు అభివృద్ధి దిశ‌గా రాష్ట్రాన్ని ముందుకు న‌డిపిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌ధానంగా మ‌హాత్మాగాంధీ క‌ల‌లు గ‌న్న గ్రామ‌స్వ‌రాజ్య సాధ‌న‌కు త‌న ప్ర‌భుత్వం ప్ర‌ధాన భూమిక పోషిస్తుంద‌ని అన్నారు.

ఈ క్ర‌మంలోనే రెండు కీల‌క ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకున్న‌ట్టు ప్ర‌మాణ స్వీకారానికి ముందుగానే జ‌గ‌న్ వెల్ల‌డించారు. వీటిలో ఒక‌టి.. గ్రామ వలంటీర్ల నియామ‌కం. రెండు గ్రామ స‌చివాల‌యాల ఏర్పాటు. నిజానికి మ‌హాత్ముడి ఆలోచ‌న కూడా గ్రామాల చుట్టూతానే తిరిగింది. గ్రామ‌స్వ‌రాజ్యానికి మ‌హాత్ముడు ప‌రిత‌పించారు. త‌ర్వాత వ‌చ్చిన పాల‌కులు తాము గాంధేయ వాదుల‌మ‌ని చెప్పుకొన్నా.. ఆయ‌న సూత్రాల‌ను అమ‌లు చేయ‌డం లోను, ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డంలోనూ ఎవ‌రూ సాహ‌సించ‌లేక పోయారు.

కానీ, ఏపీ సీఎంగా ప్ర‌మాణం చేయ‌క‌ముందుగానే త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంతరించుకున్న జ‌గ‌న్‌.. చెప్ప‌కుండానే గాంధీ సూత్రాల‌ను ఔపోస‌న ప‌ట్టారు. గాంధీ బాట‌లో న‌డిచేందుకు రెడీ అయ్యారు.
ఈ క్ర‌మంలోనే గ్రామ స్వ‌రాజ్యానికి పెద్ద‌పీట వేశారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్ర‌జ‌ల బాగోగుల‌ను ప‌ట్టిం చుకోవ‌డంతోపాటు వారికి ప్ర‌భుత్వం నుంచి అందే ల‌బ్ధిని నేరుగా పంపిణీ చేసి.. నిత్యం ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అందుబాటులో ఉంద‌ని చెప్పేందుకు వ‌లంటీర్ల‌ను నియ‌మించేందుకు జ‌గ‌న్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

దీనికిగ‌డువు మ‌రో నాలుగు రోజుల్లో స‌మీపిస్తోంది. అంటే.. ఆగ‌స్టు 15 దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన రోజున మ‌న రాష్ట్రంలోని గ్రామాల‌కు కూడా స్వ‌రాజ్యం సిద్ధించేలా పెద్ద ఎత్తున 4 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్ల‌ను విధుల్లోకి పంపాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకోవ‌డంపై హ‌ర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ స్వ‌ప్నం ఫ‌లించేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైంద‌ని అంటున్నారు.

జ‌గ‌న్ స్వప్నం.. కౌంట్ డౌన్ స్టార్ట్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share