తాజా సర్వే … కాబోయే సీఎం జగనే!

April 13, 2019 at 4:29 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మి, వైఎస్ జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మైంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇత‌ర ప్ర‌ధాన నాయ‌కుల‌తో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ఏపీలో ఎన్నిక‌లు వ‌న్‌సైడ్ తీర్పుగా జ‌రిగాయ‌ని, జ‌నాలంతా జ‌గ‌న్‌ను గెలిపించ‌డానికి పోటెత్తార‌ని పేర్కొన్నారు. ఆంధ్ర‌లో ఎప్పుడూ ఇలాంటి ప‌రిస్థితులు చూడ‌లేద‌న్నారు. గెలుపుకోసం చంద్ర‌బాబు చేసిన విన్యాసాలు జ‌నాలు న‌మ్మ‌లేద‌న్నారు. అవ‌కాశ వాదాన్ని అంద‌రూ క‌నిపెట్టార‌న్నారు.

తెలంగాణ‌లో టీఆర్ ఎస్ 16 స్థానాలు గెలువ‌బోతోంద‌ని, త‌మ మిత్ర‌ప‌క్షం మ‌జ్లిస్ ఒక స్థానంతో మొత్తం 17 స్థానాల‌ను గెలుచుకుంటామ‌న్నారు. అదే స‌మ‌యంలో ఏపీలో జగ‌న్ గెలువ‌బోయే మెజార్టీ స్థానాల‌తో కేంద్రంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషించ‌బోతున్న‌మ‌ని కేసీఆర్ చెప్పారు. ఆంధ్ర‌లో భారీ మెజార్టీతో జ‌గ‌న్ అధికారంలోకి రాబోతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైసీపీతో రాష్ర్టం అభివ్రుద్ది ప‌థంలో దూసుకెళ్తుంద‌న్నారు. జ‌గ‌న్‌కు త‌మ పూర్తి స‌హకారం ఉంటుంద‌న్నారు.

అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర‌హాలోనే ముందు రాబోతున్న ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కూడా బాగా ప‌నిచేసి మంచి ఫ‌లితాల‌ను చూపించాల‌ని పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఎక్క‌డ కూడా ఉదాసీన‌త‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని సూచించారు. మండ‌ల ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు అన్ని వ్య‌వ‌హారాలు చూసుకుంటార‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాల‌ని ఆయ‌న ఆదేశించారు.

తాజా సర్వే … కాబోయే సీఎం జగనే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share