ఆ ఐదుగురు మంత్రుల‌కు జ‌గ‌న్ షాక్!

July 10, 2019 at 5:11 pm

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ ఏర్పడి నెలన్నర రోజులు అయిందో లేదో అప్పుడే కొంత మంది మంత్రుల వ్యవహారశైలిపై సీఎం జగన్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా జగన్ కేబినెట్ ఏర్పాటుకు ముందు ఆశావహుల సంఖ్య భారీగా ఉండడంతో… ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ మంత్రులు 90 శాతం మంది రెండున్నర సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటారని… ఆ తర్వాత కొత్త వాళ్లకు అవకాశం ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. తొలి క్యాబినెట్ సమావేశంలో జ‌గ‌న్ మంత్రులు అవినీతి, అక్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని వార్నింగ్ ఇచ్చేశాడు.

ఇక ఇటీవ‌ల జగన్ కొంత మంది మంత్రుల పనితీరు విషయంలో సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. అవినీతి… అక్రమాలు సహించేది లేదని జగన్ బహిరంగంగానే చెబుతున్నారు. ఇదే విషయాన్ని తన కేబినెట్ సహ‌చ‌రులకు కూడా చెప్పారు. అయితే కొందరు మంత్రులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది… కొందరు సీనియర్ నేతలు అయితే పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం… జగన్ కోసం ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాం… ఆర్థికంగా కూడా నష్టపోయాం…. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటాం అన్న ధోరణితో ఉన్నారట.

ఏయే మంత్రులు అయితే తన ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారో ? వాళ్లకు సంబంధించిన నివేదికలను సైతం జగన్ ఇప్పటికే తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో మొత్తం ఐదుగురు మంత్రులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరు తీరు మార్చుకోక‌పోతే ఎప్పుడైనా వీరిని త‌ప్పించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని వైసీపీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఓ మ‌హిళా మంత్రికి ప‌ద‌వి రావ‌డ‌మే చాలా మందికి షాక్ ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఆమె శాఖ వ్యవహారాల్లో ఆమె భర్త జోక్యం ఎక్కువగా ఉండటంతో పాటు ఆ శాఖ‌లో ముడుపులు చేతులు మారుతున్నాయ‌ట‌.

ఇక త‌న సొంత జిల్లాకు మంత్రిగా ఉన్న ఓ సీనియ‌ర్ తానే కింగ్‌ను అని… అన్ని బ‌దిలీలు త‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గాల‌ని చూస్తుండ‌డం కూడా జ‌గ‌న్‌కు న‌చ్చ‌లేద‌ట‌. దీనిపై ఆ సీనియ‌ర్‌కు ఇప్ప‌టికే వార్నింగ్ ఇచ్చిన‌ట్టు టాక్‌. ఇక ధర్మబద్ధమైన శాఖకు మంత్రిగా ఉంటూ రెండు కోట్ల‌కు ఆ మంత్రి చేతులు చాచాడ‌ట‌. ఇక విద్యాల‌యానికి సంబంధించిన వ్య‌వ‌హారంలో మ‌రో మంత్రి.. అలాగే ఓ భారీ కాంట్రాక్టు వ్య‌వ‌హారంలో మ‌రో మంత్రి కూడా అవినీతికి తెర‌లేప‌డంతో జ‌గ‌న్ వీరి వ్య‌వ‌హారంలో సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఐదుగురు మంత్రులే కాదు… మిగిలిన మంత్రులు కూడా గీత‌దాటితే జ‌గ‌న్ ఏ మాత్రం ఉపేక్షించే ప‌రిస్థితి లేదు.

ఆ ఐదుగురు మంత్రుల‌కు జ‌గ‌న్ షాక్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share