వైసీపీ తాజా ఆలోచన : ఏపీకి రెండో రాజధాని?

June 6, 2019 at 11:04 am

అభివ్రుద్ధిని అన్ని ప్రాంతాల‌కు స‌రిగా పంచివ్వ‌క‌పోవ‌డంతోనే వేర్పాటు వాదం తెర‌మీద‌కు వ‌స్తుంది. ఒక‌ప్పుడు త‌మిళ నాడు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ర్ట‌మైనా అదే ప‌రిస్థితి, ఈ మ‌ధ్య జ‌రిగిన ఏపీ, తెలంగాణ ఈష్యూ అయినే అదే స్థితి. ప్రాంతాల మ‌ధ్య అడ్డుగోడ‌లుగా నిలిచిన కొంద‌రు నాయ‌కుల స్వార్థం కావ‌చ్చు, వారి విధానాలు కావ‌చ్చు. ఒక్క‌సారి బేధాభిప్రాయాలు వ‌చ్చాయంటే దానిని పూర్తిగా తుడిచిపెట్టేలా చేయ‌డం ఎవ‌రి త‌ర‌ము కాదు. మొన్న‌ది దాక ఏపీ సీఎంగా ఉన్న చంద్ర‌బాబు కూడా రాష్ర్టం మొత్తంగా స‌రైన అభివ్రుద్ధి చూప‌క‌పోవ‌డంతో ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు అసంత్రుప్తిగా ఉన్నారు.

త‌న‌కు, త‌న వారికి సంబంధించిన భూములు విరివిగా ఉన్న విజ‌య‌వాడ‌, గుంటూరు మ‌ధ్య రాజ‌ధాని అమ‌రావ‌తిని పెట్టి అక్క‌డే అభివ్రుద్ధి జ‌రిగేలా చూడ‌డంతో ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ వారు కొంత అసంత్రుప్తితోనే ఉన్నారు. చంద్ర‌బాబు మొట్ట‌మొద‌టిసారిగా కార్య‌క‌లాపాలు నెరిపిన విశాఖ‌ప‌ట్ట‌ణంను ఆ త‌ర్వాత అంతంగా ప‌ట్టించుకోలేదు. దీంతో ఆ ప‌ట్ట‌ణం ఏదో మొక్కుబ‌డిగా మారిపోయింది. హుద్‌హుద్ తుఫాన్ వ‌చ్చిన‌ప్పుడు మాత్రం కొంత హ‌డావుడి చేసి ఆ త‌ర్వాత అటుగా చూసిన పాప‌న పోలేదు. దీంతో అభివ్రుద్ది మాట దేవుడెరుగు ఆ న‌గ‌రం పూర్తిగా పేరుగొప్ప తీరు దిబ్బ‌లాగ నిలిచిపోయింది.

ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత విశాఖ‌ను రెండో రాజ‌ధానికిగా చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ శ్రేణులు అధినేత ఎదుట స‌ద‌రు డిమాండ్ ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు స‌మాచారం. సంవత్స‌రంలో శీతాకాలంలో మూడు నెల‌ల పాటు విశాఖ‌లో రాజ‌ధానిని కొన‌సాగిస్తే అభివ్రుద్ధి అన్ని జిల్లాల‌కు స‌మ‌ప్రాధాన్యంగా ల‌భిస్తుంద‌ని ఆ దిశ‌గా సీఎం జ‌గ‌న్ ఆలోచించేలా ఒత్తిడి తేస్తామ‌ని పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా ఈ విష‌య‌మై జ‌గ‌న్ ఏం ఆలోచిస్తాడో.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి మ‌రి..!

వైసీపీ తాజా ఆలోచన : ఏపీకి రెండో రాజధాని?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share