మంత్రివ‌ర్గ ఎంపిక‌లో ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన జ‌గ‌న్‌

June 7, 2019 at 11:43 am

ఏపీ కేబినెట్ ఎంపిక క‌స‌ర‌త్తు ప్ర‌క్రియ దాదాపు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. మంత్రివ‌ర్గ కూర్పులో జ‌గ‌న్ ఎవ్వరూ ఊహించ‌ని నిర్ణ‌యాలు తీసుకుని షాకుల మీద షాకులు ఇస్తున్నారు. దేశ చ‌రిత్ర‌లోనే ఎవ్వ‌రూ తీసుకోని విధంగా త‌న కేబినెట్‌లో ఏకంగా 5 మందికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తున్నారు. కాపు, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల‌కు త‌న కేబినెట్‌లో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ఇస్తున్నారు. ఇదే పెద్ద షాక్ అనుకుంటే రెండున్న‌రేళ్ల త‌ర్వాత 90 శాతం మంది మంత్రుల‌ను మారుస్తామ‌ని కూడా ఇప్పుడే ప్ర‌క‌టించారు.

ఇక జ‌గ‌న్ కేబినెట్‌లో ఉండే ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంల‌పై కొన్ని పేర్లు లీక్ అయ్యాయి. ఇక కాపు కోటాలో మాత్రం సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లుకు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇప్ప‌టికే ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీ కోటాలో ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత‌, బీసీ వ‌ర్గానికి చెందిన పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కె.పార్థ‌సార‌ధి, ఎస్టీ నుంచి సాలూరు ఎమ్మెల్యే పీడిక‌ల రాజ‌న్న‌దొర‌, మైనార్టీ నుంచి క‌డ‌ప ఎమ్మెల్యే అంజాద్ బాషాకు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ఖాయం అంటున్నారు.

ఇక ఇరిగేష‌న్‌, వ్య‌వ‌సాయం శాఖ‌లు జ‌గ‌న్ త‌న వ‌ద్దే ఉంచుకుంటున్న‌ట్టు కూడా తెలుస్తోంది. ఇక కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్ స్పష్టం చేశారు. ఇప్పుడు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి అప్పుడు కేటాయిస్తామని జగన్ చెప్పకనే చెప్పేశారు. కొత్తవారికి అప్పుడు అవకాశం ఇస్తామని కూడా ప్రకటించారు.

మంత్రివ‌ర్గ ఎంపిక‌లో ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన జ‌గ‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share