బ్రేకింగ్‌: జ‌గ‌న్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

June 7, 2019 at 11:18 am

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఊహాగానాల‌కు చెక్ పెడుతూ త‌న కేబినెట్‌లో మొత్తం ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మొత్తం 25 మందితో మంత్రి వ‌ర్గం ఏర్పాటు చేస్తున్న‌ట్టు చెప్పారు. మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో జ‌గ‌న్ ఈ విష‌యాలు ప్ర‌క‌టించారు.

గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో చంద్ర‌బాబు బీసీ, కాపుల‌కు రెండు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. బాబు కేబినెట్లో బీసీ వ‌ర్గం నుంచి కేఈ.కృష్ణ‌మూర్తి, కాపుల నుంచి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ఉప‌ముఖ్య‌మంత్రులుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యానికి తెర‌లేపుతూ ఏకంగా త‌న కేబినెట్‌లో ఐదుగురికి ఉప‌ముఖ్య‌మంత్రులుగా చోటు క‌ల్పించ‌డం పెద్ద సాహ‌స‌మే.

అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రం మొత్తం మ‌న‌వైపే చూస్తోంద‌ని.. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అంచ‌నాల‌కు మించి ఆ పార్టీ నేత‌లు దోచుకున్నార‌ని.. మ‌నం మాత్రం పూర్తి పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న అందించాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు.

బ్రేకింగ్‌: జ‌గ‌న్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share