నంద‌మూరి,మెగాఫ్యామిలీల‌కు వైఎస్ జగన్ చెక్‌..!

April 3, 2019 at 11:00 am

ఏపీలో రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లూ న‌ట‌న‌కే ప‌రిమితం అయిన తెలుగు చిత్ర‌సీమ న‌టీన‌టులు కూడా క‌సిగా రాజ‌కీయాల్లోకి అడుగుపెడుతున్నారు. కీల‌క స‌మ‌యంలో అనూహ్య నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు రెడీ అవుతున్నారు. దాదాపుగా చిత్ర‌సీమలో అధిక‌భాగం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అండ‌గా నిల‌బ‌డడంతో నంద‌మూరి, మెగాఫ్యామిలీలు దిక్కులు చూస్తున్నాయి. ఇన్నాళ్లూ చిత్ర‌సీమ‌లో ఆ రెండు ఫ్యామిలీల పెత్తనానికి చెక్ ప‌డిన‌ట్టేన‌నే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. వ‌ర్ధ‌మాన న‌టుల నుంచి అగ్ర‌న‌టుల వ‌ర‌కూ వైసీపీలో చేరుతున్నారు.

ఈ ప‌రిణామాల‌తో నంద‌మూరి, మెగాఫ్యామిలీలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి మొద‌టి నుంచి కూడా రోజా, విజయ్‌చందర్‌ వంటి సీనియర్‌ నటులు ఇప్ప‌టికే వైసీపీలో ఉన్నారు. ఇక పోసాని కృష్ణ‌ముర‌ళితోపాలు ప‌లువురు న‌టులు వైసీపీ త‌రుపున గ‌ళం వినిపిస్తూనే ఉన్నారు. ఇక ఈ ఎన్నిక‌ల ముందు చిత్ర‌సీమ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు వ‌రుస‌బెట్టి వైసీపీలో చేరుతున్నారు. ఇటీవల ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ, మరో నటుడు కృష్ణుడు చేరారు. తర్వాత నటి జయసుధ, హాస్యనటుడు అలీ, భానుచందర్, దాసరి అరుణ్‌కుమార్, చిన్ని కృష్ణ, రాజారవీంద్ర, తనీష్ వైసీపీలో చేరారు.

ఇక‌ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు జగన్‌కు మద్దతు పలికారు. ఇప్ప‌టికే ప్రముఖ నటుడు మోహన్‌బాబు వైసీపీలో చేరి ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా చేప‌డుతున్నారు. అలాగే మొన్న‌ రాజశేఖర్, జీవిత, హేమ, టీవీ యాంకర్‌ శ్యామల దంపతులు కూడా జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌ను, చంద్ర‌బాబును, బాల‌య్యను ప‌క్క‌న‌పెట్టి జ‌గ‌న్‌కు మద్ద‌తు తెలుపుతున్నారు. ఇలా చిత్ర‌సీమ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టులంతా కూడా ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు అండ‌గా నిల‌వ‌డంతో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా ఆలోచిస్తున్నారు. జ‌గ‌న్‌కు వెల్లువెత్తుతున్న మ‌ద్ద‌తుతో ఆయ‌న సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

నంద‌మూరి,మెగాఫ్యామిలీల‌కు వైఎస్ జగన్ చెక్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share