పీకే దాచిన నిజం.. వైసీపీలో టెన్ష‌న్ టెన్ష‌న్

May 20, 2019 at 5:54 pm

పీకే. ఈ పేరు ఏపీ రాజ‌కీయాల్లో బాగా వినిపించిన‌, ప్ర‌స్తుతం కూడా వినిపిస్తున్న పేరు. బిహార్‌కు చెందిన ఐఐటీయ‌న్ అ యిన ప్ర‌శాంత్ కిశోర్ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని అభ్య‌ర్తి న‌రేంద్ర మోడీకి రాజ‌కీయ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించి దేశ‌వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత జ‌రిగిన బిహార్ ఎన్నిక‌ల్లో అక్క‌డి నితీష్ కుమార్ కు కూడా స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించి.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయించిన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ కూడా పీకే సేవ‌ల‌ను అందిపుచ్చుకుంది. గ‌డిచిన మూడు సంవ‌త్స‌రాల‌కు ముందుగానే ఆయ‌నను పార్టీ స‌ల‌హాదారుగా నియ‌మించుకుని ఆయ‌న సూచ‌ల‌ను, స‌ల‌హాల‌ను పాటించింది.

నిజానికి జ‌గ‌న్ సుదీర్ఘ పాద‌యాత్ర వెనుక‌.. పీకే సూచ‌న‌లు, స‌ల‌హాలు ఉన్నాయ‌ని అంటారు వైసీపీ నాయ‌కులు. ఇక‌,పీకే స‌ల‌హాల నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌చారం ఊపందుకుంద‌ని, ఎలా మాట్లాడాలో.. ఎలా స్పందించాలో కూడా బాడీ లాంగ్వేజ్ నుంచి వాయిస్ వ‌ర‌కు అన్నీ పీకే సూచ‌న‌ల మేరకే చేశార‌ని అంటారు. ఇక‌, రెండేళ్లుగా పీకే బృందం క్షేత్ర‌స్థాయిలో పెద్ద ఎత్తున ప‌ర్య‌టించి జ‌గ‌న్ అనుకూల ప‌వ‌నాలపై ఓ అంచ‌నాకు వ‌చ్చింది. నియోజ‌.క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక నుంచి టికెట్ కేటాయింపు వ‌ర‌కు అంతా కూడా తెర‌వెనుక పీకేనే పార్టీని న‌డిపించాడ‌నేది వైసీపీ వ‌ర్గాల మాట‌. మ‌రి ఇంత‌గా పార్టీని న‌డిపించిన పీకే.. ఒకే ఒక్క విష‌యంలో నిజం దాచాడా?

వైసీపీని, పార్టీ శ్రేణుల‌ను కూడా ఆయ‌న స‌స్పెన్స్ లో ముంచి ఢిల్లీ వెళ్లిపోయాడా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే వైసీపీ నాయ‌కుల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వ‌చ్చాయి. మెజారిటీ స‌ర్వేలు ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి రాబోతున్నార‌నీ, పెద్ద ఎత్తున ఎంపీ స్థానాల‌ను కూడా గెలుచుకోబోతున్నార‌ని చెబుతున్నాయి. మెజారిటీ జాతీయ మీడియా సంస్థ‌లు కూడా ఇవే అంచ‌నాల‌ను వెల్ల‌డించాయి. దీంతో ఇప్పుడు పార్టీలోని కీల‌క నేత‌లు స‌హా మేధావుల వ‌ర‌కు కూడా అంద‌రి దృష్టీ పీకే పైనే ప‌డింది. పార్టీకి ప్ర‌ధాన వ్యూహ‌క‌ర్త‌గా నిలిచిన ప్ర‌శాంత్ కిషోర్‌… ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఏమీ చెప్ప‌లేదా..?

పోల్ మేనేజ్మెంట్ చేసిన ఆయ‌న‌, ఫ‌లితాల‌పై ఏదో ఒక నివేదిక‌ను జ‌గ‌న్ కు అంద‌జేయ‌కుండానే వెళ్లిపోయారా..? ఒక‌వేళ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆయ‌న ఒక అంచ‌నా వేసి, జ‌గ‌న్ కి చెప్పి ఉంటే అది ఏమై ఉంటుంద‌నే ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్నాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు పీకే ఎగ్జిట్ పోల్ స‌ర్వే నిర్వ‌హించిన‌ట్టుగానీ, స‌ర్వే చేసిన జ‌గ‌న్‌దే అదికారం అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టుకానీ ఎక్క‌డావైసీపీ ప్ర‌కటించ‌లేదు. దీంతో ఏమై ఉంటుంద‌నే టెన్ష‌న్ స‌ర్వ‌త్రా సాగుతోంది. ఒక‌వేళ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేది సస్పెన్సే అని పీకే కూడా భావించాడా? అని వైసీపీ నాయ‌కులే చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఏమై ఉంటుంద‌నేది వేచి చూడాలి.

పీకే దాచిన నిజం.. వైసీపీలో టెన్ష‌న్ టెన్ష‌న్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share