ఊహ‌కే అంద‌ని జ‌గ‌న్ అంచ‌నాలు…

June 25, 2019 at 5:46 pm

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే ప్ర‌భువులు! ఇది ఇప్ప‌టి వ‌ర‌కు పుస్త‌కాల్లో చ‌దువు కొనేందుకు మాత్ర‌మే ప‌నికి వ‌చ్చింది. ఎన్ని క‌ల స‌మ‌యంలో ఓట్ల కోసం ప్ర‌జ‌ల కాళ్లా వేళ్లాప‌డి వారికి పొర్లు దండాలు పెట్టి ప్ర‌స‌న్నం చేసుకునే నాయ‌కులు.. ఫ‌లితా లు వ‌చ్చాక‌, గెలుపు గుర్రం ఎక్క‌డా కంటికి కూడా క‌నిపించ‌ని ప‌రిస్థితి నేడు దేశ‌వ్యాప్తంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు-నాయ‌కుల‌కు మ‌ధ్య అన్నివిధాలా గ్యాప్ పెరిగిపోయింది. గ‌తంలో నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు అంటిపెట్టుకుని ఉండేవారు. ముఖ్యంగా పాత‌త‌రం నాయ‌కులు నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండేవారు. గెలుపు , ఓట‌ముల‌తో సంబంధం లేకుండా ప్ర‌జల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ముందుకు వ‌చ్చేవారు.

అయితే, గ‌డిచిన 20 ఏళ్లుగా ప‌రిస్థితి మారిపోయింది. నాయ‌కులు అంటేనే ఎన్నిక‌ల్లో గెలుపు, అధికారం కోస‌మే రాజ‌కీయా ల్లోకి వ‌చ్చామ‌నే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అవినీతి, అక్ర‌మాలు, స్కాములు గ‌త 20 ఏళ్ల‌లో ఎన్న‌డూ లేన‌న్ని వెలుగు చూశాయి. దీంతో పాల‌కులు అంటే.. ప్ర‌జ‌ల‌ను పీడించేవారు అనే ముద్ర ప‌డిపోయింది. నిన్న మొన్న‌టి వ‌రకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ సీఎం చంద్ర‌బాబు పార‌ద‌ర్శ‌కంగా ఉన్నా.. పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు మాత్రం అవినీతి కూపాల్లో కూరుకుపోయారు. దీంతో ప్ర‌భుత్వం, పార్టీ కూడా ప‌త‌న‌మైపోయాయ‌ని అంటారు సీనియ‌ర్లు. అయితే, తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు.

ఈ క్ర‌మంలోనే సోమ‌వారం తొలిసారిగా ఆయ‌న క‌లెక్ట‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగం చాలా త‌క్కువ స‌మ‌య‌మే అయినా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌జాస్వామ్య పునాదుల‌ను బ‌ల‌ప‌రిచేలా, ప్ర‌జ‌లను సంతో ష పెట్టేలా, మ‌ళ్లీ రాజ‌కీయాల్లోను, నాయ‌కుల్లోనూ నూత‌న శ‌కం ప్రారంభ‌మైంద‌ని అనిపించేలా ఉండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా క‌లెక్ట‌ర్ల‌ను ఉద్దేశించి మాట్లాడిన జ‌గ‌న్‌.. “మ‌నం పాల‌కులం కాదు.. ప్ర‌జ‌ల‌కు సేవ‌కులం“ – అంటూ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.

నేను (సీఎం) వేరు మీరు(క‌లెక్ట‌ర్లు, సెక్ర‌ట‌రీలు) వేరు కాదు.. అంతా ఒక్క‌టే.. మ‌న‌మంతా ప్ర‌జ‌ల ఆశీర్వాదం తోనే ఇక్క‌డ కూర్చున్నాం. సో.. మ‌నం పాల‌కులం అనేమాట‌ను విడిచి పెట్టి.. ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారాన్ని వినియోగించి వారికి సేవ చేద్దాం.. అని ఉద్ఘాటించారు. వాస్త‌వానికి ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొన్న గ‌త పాల‌కులు కూడా ఇంత పాద‌ర్శ‌క‌త పాటించ‌క పోవ‌డంతో ఇప్పుడు జ‌గ‌న్‌పై అంచ‌నాలు జోరందుకున్నాయి. నెల రోజుల్లోనే సీఎంగా జ‌గ‌న్ తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌తో రాజ‌కీయ మేథావులు సైతం ఇంత అనుభ‌వ‌మ‌వా ? అని షాక్ అవుతున్నారు. అధికారంలోకి వ‌చ్చి నెల రోజులు కూడా కాకముందుగానే ఆయ‌న ఇలాంటి దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డంపై అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఊహ‌కే అంద‌ని జ‌గ‌న్ అంచ‌నాలు…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share