రైట్ హ్యాండ్‌కు జ‌గ‌న్ కీల‌క ప‌ద‌వి

June 16, 2019 at 4:29 pm

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీఎం కావడంతో పదేళ్లపాటు తనతో ప్రయాణం చేసిన పలువురు కీలక నేతలకు కీలక పదవులు కట్టబెడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ కు గత కొన్ని సంవత్సరాలుగా రైట్ హ్యాండ్‌గా ఉన్న ఓ కీలక నేత కు పదవి లభించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చిరకాల ప్రాణస్నేహితుడు కె.వి.పి.రామచంద్రరావు ఎలాంటి పాత్ర పోషించారో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాడు వైఎస్ కెవీపీని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. కేవీపీ – వైఎస్ వైఎస్ కాంబినేషన్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని వాటిని విజయవంతంగా అమలు చేసింది.

ఇప్పుడు జగన్ అదే హోదాను సజ్జల రామకృష్ణారెడ్డికి కట్టబెట్టారు ముందు నుంచి జగన్ వెంట ప్రయాణం చేయడంతో పాటు… ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన హోదా లభించింది. ఆయ‌న గతంలో సాక్షి దినపత్రిక ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. సాక్షి అభివృద్ధిలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. సాక్షిలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు కూడా శ్రీకారం చుట్టారు.. సాక్షి టీవీ ద్వారా వైసీపీ వాయిస్‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంలో కృషి చేశారు.

వైసీపీ ఆవిర్భావంతో జర్నలిజం నుంచి ఆయన నేరుగా రాజకీయ నేతగా మారిపోయారు.ఈ క్రమంలోనే వైఎస్ కుటుంబానికి సజ్జల అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. వైసిపి ఆవిర్భావం తర్వాత పార్టీ పదవిలోకి వెళ్లిపోయి జగన్ కు రాజకీయ సలహాదారుగా ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఏదేమైనా పార్టీ విజ‌యంలో తన వంతు పాత్ర పోషించారు.

ఏదేమైనా త‌న కుటుంబంతో ఉన్న అనుబంధంతో పాటు తాను ప‌డిన క‌ష్టానికి స‌జ్జ‌ల‌కు మంచి ప‌ద‌వే కేటాయించారు జ‌గ‌న్‌. కేబినెట్ ర్యాంకుతో కూడిన సలహాదారు పదవిని పబ్లిక్ ఎఫైర్స్ వ్యవహారాల సలహాదారు హోదాను కల్పించారు. ప‌దేళ్ల పాటు త‌న క‌ష్ట‌న‌ష్టాల్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని గుర్తు పెట్టుకుని వారికి కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు.

రైట్ హ్యాండ్‌కు జ‌గ‌న్ కీల‌క ప‌ద‌వి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share