మందీ మార్భ‌లంతో బాబు.. ఒకే ఒక్క‌డు జ‌గ‌న్‌..!

April 10, 2019 at 6:18 pm

వైసీపీ అధినేత జ‌గ‌న్ అలుపెర‌గ‌ని యోధుడుగా పోరాటం చేస్తున్నాడు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే త‌లంపుతో ప్రజాక్షేత్రంలో అడుగిడిన జ‌గ‌న్ ఐదేళ్లుగా ప్ర‌తిప‌క్షంలో ఉండి ప్ర‌జ‌ల కోసం ఎన్నో చేశారు. అధికార పార్టీ తెలుగుదేశం జ‌గ‌న్‌ను ఒంటరి చేసేందుకు ప‌న్నిక కుట్ర‌ల‌ను కూడా లెక్క చేయ‌లేదు. నాలుగున్న‌రేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంతో అంట‌కాగుతూ ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేసినా జ‌గ‌న్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో పెట్ట‌డానికి చంద్ర‌బాబు ఉప‌యోగించుకోని రాజ్యాంగ వ్య‌వ‌స్థ లేదంటే అతిశ‌యోక్తి కాదేమో.

ప్ర‌జ‌ల‌కు సేవ చేసే కార్యాల‌ను ప‌క్క‌నబెట్టి చంద్ర‌బాబు కేవ‌లం జ‌గ‌న్‌ను తొక్కేయ‌డానికే కాల‌మంతా కేటాయించారు. తెలుగు త‌మ్ముళ్లు రాష్ర్టం మొత్తం పేట్రేగిపోతున్న వేడుక చూస్తూ ఊరుకొని త‌న పైశాచికాన్ని ప్ర‌ద‌ర్శించాడు త‌ప్ప చంద్ర‌బాబు ఎక్క‌డా ఎవ‌రినీ వారించ‌లేదు. జ‌గ‌న్‌ను ఆయ‌న కుటుంబానికి తీవ్ర ద్రోహం త‌ల‌పెడుతూనే పైకి మాత్రం ఏమీ ఎరుగ‌ని వాడిలా న‌టిస్తూ త‌న‌దైన రాజ‌కీయాన్ని ప్ర‌ద‌ర్శించాడు. చివ‌ర‌కు వైఎస్ కుటుంబ విష‌యాల‌ను కూడా రాజ‌కీయం చేయ‌డానికి వెన‌కాడ‌కుండా ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని పుర‌మాయించి ఏదేదో ప్ర‌చారం చేసే ప్ర‌య‌త్నం చేసి విఫ‌ల‌మ‌య్యారు.

ఇక ప్ర‌చారం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్‌కు ప్ర‌భుత్వ స‌ర్వెంట్లు ఎవ‌రూ సహ‌క‌రించ‌కుండా అడ్డుకున్నారు. జ‌గ‌న్కు రోజురోజుకు పెరిగిపోతున్న ప్ర‌జాద‌ర‌ణ‌ను జీర్ణించుకోలేక ప‌చ్చ‌మీడియాతో క‌లిసి లేనిపోని వార్త‌ల‌ను సైతం వండి వ‌డ్డించారు. ఎన్నిక‌ల వేళ ప్ర‌చారానికి ఉత్త‌రాది నేత‌ల‌ను కూడా రంగంలోకి దింపి తిమ్మిని బ‌మ్మిని చేసి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. దొంగ స‌ర్వేలు ప్ర‌చురిస్తూ ఓట‌ర్ల‌లో అప‌న‌మ్మ‌కాన్ని నూరిపోసే జిమ్మిక్కులూ చేశారు. కేవ‌లం ఒకే ఒక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని అష్ట‌కష్టాలు పెట్టి మ‌ళ్లీ అంద‌లం ఎక్క‌డానికి చంద్ర‌బాబు గ‌త పాతిక‌రోజులుగా చేస్తున్న నేల‌విడిచిన సాము జ‌న‌మంతా చూస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జా హ్రుద‌యాల‌ను గెలువాల్సిన బాబు, భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తూ పీఠాన్ని ద‌క్కించుకోవాల‌ని చూడ‌డం ఆయ‌న స్థాయికే చెర‌గ‌ని మ‌చ్చ‌లా మిగిలిపోనుంది.

మందీ మార్భ‌లంతో బాబు.. ఒకే ఒక్క‌డు జ‌గ‌న్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share