జ‌గ‌న్ దూకుడు.. ప‌దిరోజుల్లోనే ప‌ది సంచ‌ల‌నాలు!

June 15, 2019 at 7:57 am

డ్రైవింగ్ రాని వాడికి స్టీరింగ్ అప్ప‌గిస్తారా? అంటూ ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర సీఎంగా ఉ న్న చంద్ర‌బాబు చేసిన విమ‌ర్శ‌లు గుర్తుండే ఉంటాయి. వీటిని ప‌టాపంచ‌లు చేస్తూ.. సీఎంగా త‌న‌దైన ముద్ర వేస్తున్నా రు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌. రాష్ట్రంలో రెండో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన సీఎం జ‌గ‌న్‌.. ప‌ట్టుమ‌ని ప‌ది రోజు లు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. త‌నేంటో స‌త్తా చాటుతున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారానికి ముందే…తన కార్యాచరణ మొదలుపెట్టిన జగన్ ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు అన్నివర్గాలను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయి.

నిజానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో `అనుభ‌వం` అనే మాట‌ను పెద్ద ఎత్తున టీడీపీ ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లింది. విబ‌జ‌న‌తో అల్లాడుతున్న రాష్ట్రానికి అనుభ‌వం ఉన్న సీఎం కావాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. అయినా కూడా మార్పు కోరుకున్న ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. అంతే! త‌న‌కు అంది వ‌చ్చిన అవ‌కాశాన్ని, ప్ర‌జ‌లు ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న జ‌గ‌న్ ఈ ప‌ది రోజుల్లోనే అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. అంతేకాదు ఎంతో అనుభ‌వం త‌న సొంత‌మ‌ని, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే చంద్ర‌బాబు గ‌త ఐదేళ్ల త‌న ప్ర‌భుత్వంలో చేయ‌ని అనేక ప‌నులు చేసి చూపుతున్నారు. మ‌రిన్ని సంచ‌ల‌నాల దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

1. పొరుగు రాష్ట్రాల‌తో మైత్రి: విభ‌జ‌న‌తో అల్లాడుతున్న ఏపీ.. త‌న ల‌క్ష్యాల‌ను సాధించుకునే క్ర‌మంలో పొరుగు రాష్ట్రాల‌తోనూ మిత్ర‌త్వంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. ఆ దిశ‌గా అడుగులు వేశారు. ప‌క్క‌నే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో క‌లిసి న‌డిచేందుకు రెడీ అయ్యారు. త‌ద్వారా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన అన్ని హ‌క్కులు, ఆస్తుల‌ను సంపాయించేందుకు రెడీ అయ్యారు.

2. కేంద్రంతో మిత్ర‌త్వం: నిజానికి ప‌క్క‌రాష్ట్రాల కంటే కూడా కేంద్రంలోని ప్ర‌భుత్వంతో చెలిమి చేయాల్సిన అవ‌స‌రం ఏపీకి ఉంది. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుతో మైత్రి దిశ‌గా సీఎంగా ప్ర‌మాణం చేయ‌కుండానే అడుగులు వేయ‌డం ప్రారంభించారు.

3. సామాజిక న్యాయం: రాజ‌కీయాల్లో పెద్ద‌గా వినిపిస్తున్న డిమాండ్ ఇది. దీనిని దృష్టిలో పెట్టుకున్న జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను ఏర్పాటు చేసుకుని సంచ‌ల‌నం సృష్టించారు. ఐదుగురు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు.

4. అవినీతి ర‌హిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌త ఐదేళ్ల‌లో దేని వ‌ల్ల ఇబ్బందులు ప‌డ్డారో? ఏది రాష్ట్రంలో ఉండ‌కూడ‌ద‌ని భావించారో.. జ‌గ‌న్ ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ప్ర‌భుత్వం నుంచి అందే ప్ర‌తి సేవ‌ను పార‌ద‌ర్శ‌కంగా అందించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 15 నాటికి సీఎంవోలోనే అవినితి వ్య‌తిరేక ఉద్య‌మానికి నాందీవాచ‌కం ప‌లుకుతూ.. ఫోన్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

5. ఆర్టీసీ విలీనం: ఇది కొన్ని ద‌శాబ్దాలుగా మింగుడు ప‌డ‌ని స‌మ‌స్య‌. నిత్యం ప్ర‌జ‌ల‌ను ర‌వాణా చేసే క్ర‌తువును భుజాలకెత్తుకున్న ఆర్టీసీ అనేక కోట్ల రూపాయ‌ల అప్పుల్లో మునిగిపోయింది. ఈ క్ర‌మంలో ఆర్టీసిని కాపాడాల‌నే డిమాండ్లు, ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌లు కాగితాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. జ‌గ‌న్ వీటి దుమ్ము దులిపి, కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. ఆర్టీసిని విలీనం చేసేందుకు రెడీ అయ్యారు.

6. రాజ‌న్న బ‌డిబాట‌: ప‌్ర‌భుత్వం ఏర్పాటై ప‌దిహేను రోజులు కూడా కాకుండానే ప్ర‌బుత్వం త‌ర‌ఫున ప్రారంభ‌మైన తొలి అధికారిక కార్య‌క్ర‌మం, ప‌థ‌కం కూడా ఇదే. జూన్ 14న పెనుమాక‌లో జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను బ‌లోపేతం చేయ‌డం ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం. ప్ర‌తి విద్యార్థి చ‌దువుకు దూరం కాకూడ‌ద‌నే స‌మున్న‌త ల‌క్ష్యంతో దీనికి నాంది ప‌లికారు.

7. రివ‌ర్స్ టెండ‌రింగ్‌: గ‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన అనేక ప్రాజెక్టుల్లో అవినీతి ఏరులై పారింద‌ని గ్ర‌హించిన జ‌గ‌న్ దీనికి చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈక్ర‌మంలోనే ఆయ‌న రివర్స్ టెండరింగ్ తో అవినీతిని దూరం చేసేందుకు జగన్ ముందుకు సాగారు. రాబోయే టెండర్లకు జ్యుడిషియల్ అనుమతి తప్పనిసరి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

8. విడ‌త‌ల వారీ మ‌ద్య నిషేధం: మ‌ద్య నిషేధం. ఈ మాట అంటేనే ప్ర‌భుత్వాలు గ‌డ‌గ‌డ ఒణుకుతాయి ప్ర‌ధానంగా ప్ర‌భుత్వాల‌కు ఉన్న ఆదాయం ఇక్క‌డ నుంచే వ‌స్తుంది. అయినా కూడా రాష్ట్రంలోని మ‌హిళ‌లు ఆనందంగా ఉండేందుకు, కుటుంబాలు సంతోషంగా గ‌డిపేందుకు మ‌ద్య‌నిషేధం కీల‌క‌మ‌ని గుర్తించిన జ‌గ‌న్‌.. దీనిని విడ‌త‌ల వారీగా నిషేధించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

9. ఉద్యోగుల్లో భ‌రోసా: ప‌్ర‌భుత్వానికి-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అనుసంధాన క‌ర్త‌లు ఉద్యోగులే. ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. అమ‌లు చేసి, ప్ర‌జ‌ల‌కు ఫ‌లాల‌ను అందించే బాధ్య‌త వీరిపైనే ఉంటుంది. దీనిని గుర్తించిన జ‌గ‌న్ అవినీతి ర‌హిత పాల‌న‌తోపాటు ఉద్యోగులు క్ర‌మ‌శిక్ష‌ణ పాటించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. వారి ప్ర‌ధాన డిమాండ్‌గా ఉన్న 27% ఐఆర్‌కు ఓకే చెప్పారు. అంతేకాదు, సాయంత్రం 5.30 త‌ర్వాత ఆఫీసుల్లో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పడం ఉద్యోగ వ‌ర్గాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేస్తోంది.

10. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిబింబం: ఉద్యోగాలకి నోటిఫికేషన్లు – ఫించన్లు పెంపు – ఆశా వర్కర్లకు జీతాల పెంపు – జర్నలిస్టుల ఆరోగ్య బీమా వంటివి అమలు చేస్తూ – ప్రజల నమ్మకం నిలబెడ్తున్నారు. తన గెలుపులో రైతులది కీలక పాత్ర కాబట్టి వారికోసం 12500 పెట్టుబడి సహాయం అందించేందుకు సిద్దమయ్యారు. భూ సమస్యలు – పట్టాదారు పుస్తకాలు వంటివి సమస్యలుగా కాకుండా గ్రామ సచివాలయం ప్రారంభించనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామన్నారు. ఇసుక విధానం రద్దు చేసేశారు. కార్డు దారుల ఇంటికే బియ్యం – నిత్యావసరాలు సిద్ధం చేశారు. ఇలా జ‌గ‌న్ కేవలం ప‌ది రోజుల్లోనే త‌నేంటో నిరూపించారు. రాబోయే రోజుల్లో మ‌రింతగా త‌న దూకుడు ఉంటుంద‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

జ‌గ‌న్ దూకుడు.. ప‌దిరోజుల్లోనే ప‌ది సంచ‌ల‌నాలు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share