ఏపీ సీఎం బాట‌లో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్‌

August 12, 2019 at 11:24 am

అధికారం చేప‌ట్టిన రెండు నెల‌ల్లోనే వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న‌లో త‌న‌దైన ముద్ర‌వేస్తున్నాడు. అవినీతి, అక్రమాల‌కు తావివ్వ‌కుండా.. పార‌ద‌ర్శ‌క పాల‌న అందించేందుకు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తీసుకున్న మ‌రో నిర్ణ‌యం.. ప‌రిశ్ర‌మ‌ల్లోనే స్థానికుల‌కే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాల‌ని. జ‌గ‌న్ నిర్ణ‌యానికి..యువ‌త నుంచే గాకుండా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా యువ‌త ఉపాధి క‌ల్పించేందుకు జ‌గ‌న్ తీసుకుంటున్న‌నిర్ణ‌యాలు ఇత‌ర రాష్ట్రాల వారిని కూడా ఆలోచింప‌జేస్తున్నాయి. ఇప్పుడు ఈ దిశ‌లోనే ప్ర‌ముఖ హీరో ఉపేంద్ర కూడా అడుగులు వేస్తున్నారు. కర్ణాటకలో ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా.. ఈ డిమాండ్ పై ఆగస్ట్‌ 14, 15వ‌ తేదీల్లో ఉపేంద్ర నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఇప్పుడు ఈ విష‌యంలో క‌ర్ణాట‌క‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఉపేంద్ర డిమాండ్‌కు కూడా మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

నిజానికి.. ఏపీ అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికుల‌కు 75 శాతం ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని చెప్పారు. ఇప్పుడు ఆ హామీని నెర‌వేర్చే దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. కొత్త‌గా ఏర్పాటు చేసే ప‌రిశ్ర‌మ‌ల్లో దీనిని క‌చ్చితంగా అమ‌లు చేసే దిశ‌గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ఉన్న ప‌రిశ్ర‌మ‌ల్లోనే ఇక‌ముందు చేప‌ట్ట‌బోయే ఉద్యోగాల భ‌ర్తీలో 75శాతం స్థానికుల‌కే ఇచ్చేలా చూస్తున్నారు. వ‌ల‌స‌ల‌ను నివారించి, ఎక్క‌డిక‌క్క‌డే ఉద్యోగాలు, ఉపాధి క‌ల్పించే దిశ‌గా ఆలోచిస్తున్న జ‌గ‌న్‌కు అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ప్ర‌ధానంగా ఇత‌ర రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను, మిగ‌తా వ‌ర్గాల‌ను కూడా ఆలోచింప‌జేస్తున్నారు. ఇందులో భాగంగానే జ‌గ‌న్ బాట‌లో క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర క‌దులుతున్నారు. ముందుముందు మ‌రెంద‌రు వ‌స్తారో చూడాలి మ‌రి.

ఏపీ సీఎం బాట‌లో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share