ఆ సీట్ల‌లో గెలుపుపై వైసీపీ లెక్కలు

April 20, 2019 at 10:34 am

ఆంధ్రప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు ముగిశాయి. అన్ని పార్టీల నేత‌లు ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటూ స‌ర్వేలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ క్ర‌మంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ త‌మ గెలుపు సీట్ల‌పై ఓ అవ‌గాహ‌న‌తో ఉన్నాయి. వారివారి లెక్క‌ప్ర‌కారం ఆయా జిల్లాల్లోని సీట్ల‌ను గెలువ‌డం, ప్ర‌భావితం చేయ‌డం అనే క్యాలికులేష‌న్ల‌లో పార్టీ నేత‌లు ఉన్నారు. ఆయా స్థానాలు వైసీపీ వ‌శం అయితే జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయం అనే రీతిలో ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. గ‌తంలో కొద్ది తేడాతో సీఎం పీఠానికి దూర‌మైన పార్టీ ఇప్పుడు ఆ స్థానాల‌పై ప‌క్కాగా లెక్క‌లు తేల్చుకుంటున్నాయి.

కోస్తా జిల్లాలైన తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు, మండ‌పేట‌, జ‌గ్గంపేట‌, రాజాన‌గ‌రంలు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు, పాల‌కొల్లు, ఉండి, గుంటూరు నుంచి పొన్నూరు, గుంటూరు వెస్ట్‌, నెల్లూరు జిల్లా నుంచి కొవ్వూరు, ఆత్మ‌కూరు, నెల్లూరు సిటీ, క్రుష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం, విజ‌య‌వాడ తూర్పు, తిరువూరు, ప్ర‌కాశం నుంచి ప‌ర్చూరు, సంత‌నూత‌ల‌పాడు స్థానాల్లో త‌మ గెలుపు ఎలా ఉండ‌బోతోంది, గెలుపు ప్ర‌భావం ఎంత వ‌ర‌కు ఉంటుంద‌నే లెక్క‌లు తీసే కార్య‌క్ర‌మంలో వైసీపీ నేత‌లున్నారు. అలాగే, రాయ‌ల‌సీమ జిల్లాలైన క‌డ‌ప నుంచి బ‌ద్వేలు, ప్రొద్దుటూరు, అనంత‌పురం నుంచి హిందూపురం, క‌ల్యాణ‌దుర్గం, ఉర‌వ‌కొండ‌, పెనుకొండ‌, మ‌డ‌క‌శిర స్థానాలు, అలాగే, క‌ర్నూల్ నుంచి కోడుమూరు, ఎమ్మిగ‌నూరు, నంద్యాల స్థానాలు, చిత్తూరు నుంచి పూత‌ల‌ప‌ట్టు, ప‌ల‌మ‌నేరు, చిత్తూరు స్థానాల్లో త‌మ‌త‌మ బ‌లాన్ని అంచనా వేసే కార్యంలో నిమ‌గ్న‌మ‌య్యారు.

ఇక ఉత్త‌రాంద్ర జిల్లాల్లోకి వ‌స్తే శ్రీ‌కాకుళం నుంచి పాల‌కొండ‌, రాజాం, టెక్క‌లి, ఆముదాల‌వ‌ల‌స‌, విజ‌య‌న‌గ‌రం నుంచి నెల్లిమ‌ర్ల‌, బొబ్బిలి, శ్రుంగ‌వ‌ర‌పుకోట‌, విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ స్థానాలు, విశాఖ జిల్లాకు వ‌స్తే విశాఖ నార్త్‌, ఇస్ట్, సౌత్‌, వెస్ట్‌ల‌తో పాటు అర‌కువెలీ, పెందుర్తి అసెంబ్లీ స్థానాల్లో త‌మ గెలుపు అవ‌కాశాలు, త‌మ అధినేత జ‌గ‌న్ సీఎం పీఠం ఎక్కే అవ‌కాశాల‌పై వైసీపీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఆయా స్థానాల్లో గెలుపు బావుటా ఎగ‌రేస్తే జ‌గ‌న్‌సీఎం కావ‌డం ఎంతో తేలిక‌నే విష‌యాన్ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. గ‌తంలో ఆయా స్థానాల్లో వైసీపీ ఓట‌మికి అప్పుడు ప‌వ‌న్ టీడీపీకి ఇచ్చిన మ‌ద్ద‌తు కార‌ణం కాగా, ఇప్ప‌డు ప‌వ‌న్ ప్ర‌త్యేక పార్టీతో బ‌రిలో నిల‌వ‌డంతో జ‌గ‌న్ గెలుపు సుల‌భ‌మైంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

ఆ సీట్ల‌లో గెలుపుపై వైసీపీ లెక్కలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share