రికార్డుల రారాజులు కోట‌గిరి, ఎలీజా

May 27, 2019 at 11:47 am

ఏపీలో తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్ధులు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టారు. వైసిపికి 151 అసెంబ్లీ సీట్లతో పాటు ఏకంగా 22 ఎంపీ సీట్లు రావడం పెద్ద రికార్డు. ఇక తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత హీనంగా 23 సీట్లకు పడిపోవటం ఘోరమైన రికార్డు. రాయలసీమ చరిత్రలో ఆ పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితం కావడం కూడా ఓ రికార్డ్. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సీమ ఎంపీ అభ్యర్థులు అందరూ ప్రతి ఒక్కరూ 1.5 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయాలు సాధించారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన 21 మంది అభ్యర్థులకు ఏకంగా 40 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇది కూడా సంచలన రికార్డ్. ఈ రికార్డుల పరంపరలో పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు ఎంపీగా గెలిచిన కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచి తమ ఖాతాలో అరుదైన రికార్డులు లిఖించుకున్నారు.

ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కోటగిరి శ్రీధర్ తన సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబుపై ఏకంగా 1.65 లక్షల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ మెజార్టీ ఒక సంచలనం అయితే.. ఆరు దశాబ్దాల ఏలూరు చరిత్రలో నాన్ కమ్మ వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఎంపీగా గెలవడం విశేషం. గత ఆరు దశాబ్దాలుగా ఏ పార్టీ నుంచి అయినా ఏలూరు ఎంపీగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే గెలుస్తున్నారు. ఇప్పుడు వెల‌మ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ ఇక్కడ నుంచి సంచలన విజయం సాధించారు. ఏలూరు లోక్‌స‌భ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైసిపి అభ్యర్థులే ఘన విజయాలు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆరు దశాబ్దాల రికార్డులు తిరగరాయడంతో పాటు ఏకంగా భారీ మెజారిటీ కూడా సాధించారు. ఇక శ్రీధర్ సొంత నియోజకవర్గమైన చింతలపూడి నుంచి గెలిచిన ఎలీజా కూడా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు.

గత కొన్ని దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో 1999 లో దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావుకు వచ్చిన 32 వేల కోట్ల మెజార్టీ అత్యధికంగా ఉంటూ వస్తోంది. తాజా ఎన్నికల్లో కోటగిరి రికార్డులను ఎలీజా బద్దలు కొట్టారు. ఈ ఎన్నికల్లో ఎలీజాకు ఏకంగా 36 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. నియోజకవర్గ చరిత్రలోనే ఈ మెజారిటీతో రికార్డుగా నిలిచిపోయింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచినప్పుడు ఆ పార్టీకి ఈ స్థాయి మెజార్టీ ఎప్పుడు రాలేదు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన మాజీ మంత్రి పీతల సుజాతకు 16 వేల ఓట్ల మెజారిటీ రాగా ఇప్పుడు ఎలీజ‌కు ఆ మెజారిటీకి డబుల్ మెజారిటీ కంటే ఇంకా పైన రావడం విశేషం. ఏదేమైనా అటు కోటగిరి, ఇటు ఎలీజా ఇద్దరు అదిరిపోయే రికార్డులను రాజకీయ ఆరంగ్రేటంతోనే తమ ఖాతాలో వేసుకున్నారు.

రికార్డుల రారాజులు కోట‌గిరి, ఎలీజా
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share